హోమ్ /వార్తలు /సినిమా /

The Warriorr: రామ్ పోతినేని ది వారియర్ సెన్సార్ రిపోర్ట్.. రన్ టైమ్ ఎంతంటే?

The Warriorr: రామ్ పోతినేని ది వారియర్ సెన్సార్ రిపోర్ట్.. రన్ టైమ్ ఎంతంటే?

Photo Twitter

Photo Twitter

Ram pothineni: ది వారియర్ మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు రామ్. ఈ సినిమాలో ప‌వ‌ర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ సత్య పాత్రలో రామ్ నటిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది.

ఇంకా చదవండి ...

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తనలోని మాస్ యాంగిల్ బయటపెట్టారు రామ్ పోతినేని (Ram Pothineni). ఆ తర్వాత ఉస్తాద్‌గా తన ఇమేజ్‌ను ఎస్టాబ్లిష్ చేసుకున్న ఈ ఎనర్జిటిక్ స్టార్ రీసెంట్ గా రెడ్ మూవీతో యావరేజ్ హిట్ అందుకున్నారు. ఇక ఇప్పుడు లింగుసామి దర్శకత్వంలో చేసిన ది వారియర్ (The Warrior) మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ సినిమాలో ప‌వ‌ర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ సత్య పాత్రలో రామ్ నటిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. జూలై 14న (The Warrior Release Date) ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది.

తాజాగా ఈ మూవీ సెన్సార్ పూర్తయింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి UA సర్టిఫికెట్ లభించింది. 2 గంటల 35 నిమిషాల రన్ టైమ్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మేరకు ఈ విషయాన్ని తెలుపుతూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ప్రతిష్టాత్మక సినిమాలో రామ్ పోతినేని సరసన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్ గా నటించింది. విజిల్ మహాలక్ష్మి రోల్‌లో ఆమె కనిపించనుంది. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన అన్ని అప్ డేట్స్ కూడా సినిమాపై హైప్ పెంచేశాయి. రామ్ లుక్స్ చూసి ఫిదా అయిన ప్రేక్షకలోకం ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తోంది. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా నటించాడు.

కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కృతి శెట్టి తన ఆనందాన్ని బయటపెట్టింది. 'ది వారియర్' సినిమాలో తన పాత్ర అందరూ ప్రేమించేలా ఉంటుందని ఆమె తెలిపింది. గాళ్ నెక్స్ట్ డోర్, క్యూట్ రోల్ అని పేర్కొంది. కథ విన్న వెంటనే తాను కనెక్ట్ అయ్యానని, ప్రేక్షకులు కూడా కనెక్ట్ అవుతారని అనుకుంటున్నానని చెప్పుకొచ్చింది. సినిమా చూసినప్పుడు మన ఇంట్లో అమ్మాయి లేదా పక్కింటి అమ్మాయి అనుకుంటారని తెలిపింది.

రామ్ తో కాంబినేషన్ పై ఆమె రియాక్ట్ అవుతూ.. బుల్లెట్, విజిల్స్ సాంగ్స్ చూశారు కదా! అందరూ మా పెయిర్ బావుందని అంటున్నారు. సీన్స్ కూడా బావుంటాయి. థియేటర్లలో సినిమా వచ్చే వరకు వెయిట్ చేయండి. సీన్స్ గురించి ఇప్పుడే చెప్పలేను అని చెప్పింది. సెట్స్‌లో రామ్ పోతినేని హై ఎనర్జీతో ఉంటారని, ఈ సినిమాలో తన నటనకు ప్రేక్షకుల రియాక్షన్ చూసి నేను విజిల్స్ వేస్తానంటూ డిఫరెంట్ కామెంట్స్ చేసింది కృతి శెట్టి.

Published by:Sunil Boddula
First published:

Tags: Krithi shetty, Ram Pothineni, The Warrior

ఉత్తమ కథలు