Home /News /movies /

RAM POTHINENI THE WARRIOR TEASER RELEASED RAMS INTENSE LOOK IS IMPRESSIVE SR

Ram Pothineni | The Warrior Teaser : ది వారియర్ టీజర్ విడుదల.. పోలీస్‌ లుక్‌లో ఇరగదీసిన రామ్..

Ram Pothineni The Warrior teaser Photo : Twitter

Ram Pothineni The Warrior teaser Photo : Twitter

Ram Pothineni | The Warrior Teaser : రామ్ పోతినేని  (Ram Pothineni) రెడ్ సినిమా తర్వాత తమిళ డైరెక్టర్ లింగుసామితో  ‘ది వారియర్’ (The Warrior) అంటూ ఓ పోలీస్ యాక్షన్ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి  (krithi shetty)నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం జూలై 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు రెడీ అవుతోంది.

ఇంకా చదవండి ...
    Ram Pothineni - The Warriorr : టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని  (Ram Pothineni) రెడ్ సినిమా తర్వాత తమిళ డైరెక్టర్ లింగుసామితో  ‘ది వారియర్’ (The Warrior) అంటూ ఓ పోలీస్ యాక్షన్ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి  (krithi shetty)నటిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల (Ram Pothineni)  రామ్ లుక్ ఒకటి విడుదలై సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా జూలై 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు రెడీ అవుతోంది. దీంతో ప్రమోషన్స్‌ను మొదలు పెట్టింది టీమ్. అందులో భాగంగా ఈ సినిమా నుంచి అవైటెడ్ హై వోల్టేజ్ యాక్షన్ టీజర్‌ని  (The Warrior) ఈరోజు సాయంత్రం విడుదల చేసింది. ఒకేసారి తెలుగుతో పాటు తమిళ భాషాల్లో విడుదలై టీజర్ నెటిజన్స్ తెగ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో రామ్ పోలీస్ ఆఫీసర్‌గా అదరగొట్టారని టీజర్‌ను చూస్తుంటే తెలుస్తోంది. రామ్ లుక్ కూడా అదిరింది. ఆది పినిశెట్టిని విలన్‌గా చూపించారు. కృతి శెట్టి క్యూట్‌గా మెరిసింది. యాక్షన్ ఎంటర్టైనర్‌గా వస్తోన్న ఈ చిత్రం జూలై 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. దీంతో ఇప్పటికే ఈ సినిమా నుంచి ఓ మాస్ సాంగ్ విడుదలై యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది.

    ఇక మరోవైపు తెలుస్తోన్న సమాచారం మేరకు తాజాగా ఈ చిత్రం (The Warriorr) హిందీ వెర్షన్ కి సంబంధించి ఓ భారీ డీల్ కుదిరింది. ఈ చిత్రం హిందీ డబ్బింగ్ రైట్స్ రూ.  16 కోట్ల రూపాయలకి అమ్ముడైనట్లు తెలుస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం పై శ్రీనివాస చిట్టూరీ ఈ (The Warriorr) చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఆది పినిశెట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ నటిస్తున్నారు. ఈ సినిమాలో రామ్‌ (Ram Pothineni) తొలిసారి పోలీస్‌ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషలకు కలిపి డిస్నీ హాట్ స్టార్ రూ. 35 కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం. మొత్తంగా డిజిటల్, శాటిలైట్, డబ్బింగ్ రూపేణా.. నాన్ థియేట్రికల్‌గా ఈ సినిమాకు రూ. 41 కోట్ల లాభం విడుదలకు ముందే వచ్చింది.


    ‘ది వారియర్’ మూవీ సెట్స్ పై ఉండగానే.. రామ్ (Ram Pothineni)  మరో సినిమాను మొదలు పెట్టారు. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించనున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపోందనుంది.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Krithi shetty, Ram Pothineni, The Warrior, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు