Home /News /movies /

RAM POTHINENI THE WARRIOR MOVIE TRAILER RELEASE UPDATE SB

Ram Pothineni:రామ్ పోతినేని 'ది వారియర్' ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు!

Ram Pothineni The Warrior Photo : Twitter

Ram Pothineni The Warrior Photo : Twitter

జులై 1వ తేదీన .. రాత్రి 7:57 నిమిషాలకు ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టుగా చెబుతూ, అధికారిక పోస్టర్ ను వదిలారు.దీంతో రామ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

    రామ్ పోతినేని హీరోగా... లింగుసామి దర్శకత్వంలో 'ది వారియర్' రూపొందింది. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాకి, లింగుసామి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో రామ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. రామ్ ఈ సినిమాలో మొదటిసారిగా పోలీస్ ఆఫీసర్‌ పాత్రలో కనిపిస్తున్నాడు. పోలీస్ ఆఫీసర్ పాత్రను రామ్ చేయడం ఇదే ఫస్టు టైమ్. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా నిర్మితమైంది. ది వారియర్ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు.

    ఆయన స్వరపరిచిన 'బుల్లెట్' సాంగ్ కి రికార్డు స్థాయి రెస్పాన్స్ వచ్చింది. ఆ తరువాత వదిలిన 'విజిల్' సాంగ్ కూడా అదే స్థాయిలో దూసుకుపోతోంది. తెలుగు - తమిళ భాషల్లో కలుపుకుని ఇప్పటికే ఈ పాట 12 మిలియన్ ప్లస్ వ్యూస్ ను తెచ్చుకోవడం విశేషం. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖాయం చేశారు. జులై 1వ తేదీన .. రాత్రి 7:57 నిమిషాలకు ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టుగా చెబుతూ, అధికారిక పోస్టర్ ను వదిలారు.



    కృతి శెట్టి రామ్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను, జులై 14వ తేదీన తెలుగు .. తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. రామ్‌ - లింగుస్వామి కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం 'ది వారియర్‌'. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. ఆది పినిశెట్టి ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటించారు. ఈ నేపథ్యంలోనే జూలై 1న సాయంత్రం 7:57 గంటలకు ట్రైలర్‌ విడుదల చేయనున్నారు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Ram Pothineni, The Warrior

    తదుపరి వార్తలు