హోమ్ /వార్తలు /సినిమా /

The Warrior Movie Review : ‘ది వారియర్’ మూవీ రివ్యూ.. రొటీన్ పోలీస్ యాక్షన్ డ్రామా..

ది వారియర్ (The Warrior)
ది వారియర్ (The Warrior)
2.5/5
రిలీజ్ తేదీ:14/7/2022
దర్శకుడు : లింగుసామి (Lingusamy)
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్
నటీనటులు : రామ్, ఆది పినిశెట్టి, కృతి శెట్టి, నదియా తదితరులు..
సినిమా శైలి : పోలీస్ యాక్షన్ డ్రామా

The Warrior Movie Review : ‘ది వారియర్’ మూవీ రివ్యూ.. రొటీన్ పోలీస్ యాక్షన్ డ్రామా..

‘ది వారియర్’ మూవీ రివ్యూ  (Ram The Warriorr Photo : Twitter)

‘ది వారియర్’ మూవీ రివ్యూ (Ram The Warriorr Photo : Twitter)

The Warrior Movie Review :రామ్ పోతినేని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ది వారియర్’. తమిళ దర్శకుడు లింగుసామి దర్శకత్వం వహించారు. ఆది పినిశెట్టి ప్రతి నాయకుడిగా నటించిన ఈ మూవీలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాలో రామ్ తొలిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. మరి ఈ మూవీతో రామ్ హిట్ అందుకున్నాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

ఇంకా చదవండి ...

రివ్యూ : ది వారియర్  (The Warrior)

నటీనటులు : రామ్, ఆది పినిశెట్టి, కృతి శెట్టి, నదియా తదితరులు..

ఎడిటర్: నవీన్ నూలి

సినిమాటోగ్రఫీ: సుజిత్ వాసుదేవ్

సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్

నిర్మాత : శ్రీనివాస చిట్టూరి                                                                                                    దర్శకత్వం: లింగుసామి                                                                                                             విడుదల తేది : 14/7/2022

రామ్ పోతినేని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ది వారియర్’. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో ఆది పినిశెట్టి విలన్‌గా నటించారు. ఇక తమిళ యాక్షన్ చిత్రాల దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ తెలుగుతో పాటు తమిళంలో ఏక కాలంలో ఈ రోజు  విడుదలైంది. మరి పోలీస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన  ఈ మూవీతో రామ్ పోతినేని హీరోగా సక్సెస్ అందుకున్నాడా ? లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ విషయానికొస్తే..

సత్య (రామ్ పోతినేని) ప్రభుత్వ డాక్టర్. వృత్తి రీత్యా కర్నూలుకు వస్తాడు. అక్కడ అనధికారికంగా గురు (ఆది పినిశెట్టి) రాజ్యం నడుస్తోంది. ఈ నేపథ్యంలో గురు తనకు అడ్డొచ్చిన వాళ్లను చంపేస్తూ పోతుంటాడు. ఆ నేపథ్యంలో గురుకు వ్యతిరేకంగా సత్య పోలీస్ కంప్లైంట్ చేస్తాడు. ఈ విషయంలో గురు సత్యపై పగపడతాడు. అతనినిపై దాడికి దిగుతాడు. ఆ తర్వాత సత్య ఏమయ్యాడో ఎవరికీ తెలియదు. మొత్తంగా తనపై ఎటాక్ చేసిన గురుపై సత్య ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు. దాని కోసం ఐపీఎస్‌కు ఎలా సెలెక్ట్ అయ్యాడు. ? తిరిగి అదే ఊరికి DSPగా ఛార్జ్ తీసుకొని.. గురుపై ప్రతీకారం తీర్చుకున్నాడా ? మధ్యలో ఆరేజే విజిల్ మహాలక్ష్మి (కృతి శెట్టి) ఎవరు ? ఆమెతో సత్య రిలేషన్ ఏంటి అనేది  ‘ది వారియర్’  మూవీ స్టోరీ.

కథనం.. టెక్నీషియన్స్ విషయానికొస్తే..

దర్శకుడు లింగుసామి ఓ సాదాసీదా పోలీస్  కథను ‘ది వారియర్’ మూవీకి ఎంచుకున్నాడు. పోలీస్ నేపథ్యంలో తెరకెక్కే ఏ సినిమాలోనైనా.. ఇదే ఫార్ములానే చాలా మంది దర్శకులు నమ్ముకున్నారు. ఒక ఊరిలో బలమైన విలన్. అతని ఆగడాలకు ప్రజలు విలవిలలాడిపోతుంటారు. ఈ నేపథ్యంలో ఆ ఊరికి కొత్త పోలీస్ ఆఫీసర్ వచ్చి ఆ దుండుగుడి భరతం పట్టడమే అనే కాన్సెప్ట్ అంకుశం జమానా నుంచి నడుస్తోంది. ‘ది వారియర్’ మూవీకి కూడా అదే తరహా కథను రొటీన్ కథను ఎంచుకున్నాడు లింగుసామి. ఇలాంటి స్టోరీస్‌లో తర్వాత ఏం జరుగుతుందనేది ఆడియన్స్‌కు తెలిసిపోతుంటుంది. ఇక లింగుసామి కూడా పోలీస్ కథకు కావాల్సిన ఒక ఫార్మాట్‌ను సెట్ చేసుకొని ఆ బరిలోనే ఈ సినిమాను అల్లుకున్నాడు. రొటీన్ స్టోరీ అయినా.. అక్కడడక్క దర్శకుడిగా తన మార్క్ చూపించాడు. హీరో ముందుగా డాక్టర్‌గా చూపించాడు. ఒక వైద్యుడిగా రోగులకు ట్రీట్‌మెంట్ ఇవ్వవచ్చు. కానీ అదే పోలీస్ ఆఫీసర్ అయితే.. సమాజానికీ ట్రీట్మ్‌మెంట్ ఇవ్వవచ్చనే కాన్సెప్ట్‌తో డాక్టర్ నుంచి పోలీస్‌గా మారిన యువకుడి కథను  తెరకెక్కించాడు.

ఈ స్టోరీ తమిళనాడులో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించినట్టు చెప్పారు. ముఖ్యంగా హీరో, హీరోయిన్స్  మధ్య లవ్ ట్రాక్ ఏమంత ఎఫెక్ట్‌గా లేదు. కథను కూడా ఇంటర్వెల్ వరకు ముందుకు కదలదు. క్లైమాక్స్ మాత్రం సాదాసీదాగా ముగించడం కాస్త అసంతృప్తికి గురి చేస్తోంది.  అంతేకాదు దర్శకుడు ‘ది వారియర్’ కొత్తగా చెప్పే ప్రయత్నం చేయకపోయినా..  బీ, సీ,  సెంటర్ ఆడియన్స్‌కు దృష్టిలో పెట్టుకొని  ‘ది వారియర్’ మూవినీ  ఊర మాస్గా తెరకెక్కించినట్టు అర్ధమవుతోంది. ఇక ఈ సినిమాకు సుజిత్ వాసుదేవ్ ఫోటోగ్రఫీ బాగుంది. నవీన్ నూలి .. ఇంటర్వెల్ కు ముందు ఇంకాస్త ట్రిమ్ చేస్తే బాగుండేది. ఇక దేవీశ్రీ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటల్లో హోలి సాంగ్‌తో పాటు, బుల్లెట్ సాంగ్ బాగున్నాయి.

నటీనటుల విషయానికొస్తే.. 

రామ్ పోతినేని తొలిసారి ఈ సినిమాలో డాక్టర్‌గా, పోలీస్ ఆఫీసర్ ‌ సత్యగా  తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్‌గా అతని ఆహార్యం బాగుంది. పర్ఫెక్ట్‌గా సెట్‌ అయింది. ముఖ్యంగా ఇంటర్వెల్ బాంగ్‌లో ఎంట్రీ అదిరిపోయింది. ఇక ఆది పినిశెట్టికి హీరోకు ఏ మాత్రం తక్కువ కాకుండా గురు పాత్రలో అదరగొట్టేసాడు. ఆది విలనిజంతోనే హీరో రామ్ పాత్ర ఈ సినిమాలో బాగా ఎలివేట్ అయింది. సరైనోడు తర్వాత ఆ రేంజ్‌లో ఈ సినిమాలో ప్రతి నాయకుడిగా తన విలనిజం పండించాడు. కృతి శెట్టి ఉన్నంతలో క్యూట్‌గా ఉంది. డాన్సుల్లో ఇరగదీసింది. హీరోగా తల్లి పాత్రలో నదియా నటన బాగుంది. ముఖ్యంగా విలన్‌కు కూరగాయల మార్కెట్‌లో వార్నింగ్ ఇచ్చే సీన్ హైలెట్. ఇక ఇతర పాత్రల్లో నటించిన నటనటులు తమ పరిది మేరకు నటించారు.

ప్లస్ పాయింట్స్ 

పోలీస్ ఆఫీసర్‌గా రామ్ పోతినేని యాక్షన్

విలన్‌గా ఆది పినిశెట్టి

బ్యాక్ గ్రౌండ్ స్కోర్

యాక్షన్ సీన్స్

మైనస్ పాయింట్స్ 

రొటీన్ స్టోరీ

ఫస్టాఫ్

హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్

చివరి మాట : ‘ది వారియర్’ రొటీన్ పోలీస్ యాక్షన్ డ్రామా..

రేటింగ్ : 2.5/5

Published by:Kiran Kumar Thanjavur
First published:

రేటింగ్

కథ:
2/5
స్క్రీన్ ప్లే:
2.5/5
దర్శకత్వం:
2.5/5
సంగీతం:
3/5

Tags: Aadhi Pinisetty, Krithi shetty, Ram Pothineni, The Warrior, Tollywood

ఉత్తమ కథలు