RAM POTHINENI THE WARRIOR MOVIE BULLET SONG CROSS 100 MILLION IN TELUGU TAMIL VERSIONS TA
Ram Pothineni - The Warrior : విడుదలకు ముందే రామ్ పోతినేని ‘ది వారియర్’ మూవీ బుల్లెట్ సాంగ్ మరో రికార్డు..
రామ్, కృతి శెట్టిల ‘ది వారియర్’ మూవీ నుంచి బుల్లెట్ సాంగ్ 100 మిలియన్ క్లబ్
(Twitter/Photo)
Ram Pothineni | The Warriorr : టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) రెడ్ సినిమా తర్వాత తమిళ డైరెక్టర్ లింగుసామితో ‘ది వారియర్’ (The Warrior) అంటూ ఓ పోలీస్ యాక్షన్ సినిమా చేసారు. తాజాగా ఈ సినిమా నుంచి బుల్లెట్ సాంగ్ మరో రికార్డును క్రియేట్ చేసింది.
Ram Pothineni | The Warriorr : టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) రెడ్ సినిమా తర్వాత తమిళ డైరెక్టర్ లింగుసామితో ‘ది వారియర్’ (The Warrior) అంటూ ఓ పోలీస్ యాక్షన్ సినిమా చేసారు. ఈ సినిమాలో హీరోయిన్గా ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి (krithi shetty)నటించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీటైంది. ఇక షూటింగ్ పూర్తి అవ్వడంతో టీమ్ పోస్ట్ ప్రోడక్షన్ పనులపై ఫోకస్ చేయనుంది. మంచి అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా జూలై 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు రెడీ అవుతోంది. ఇక ఇటీవల (Ram Pothineni) రామ్ లుక్ ఒకటి విడుదలై సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. జూలై 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు రెడీ అవుతుండడంతో.. ప్రమోషన్స్‌ను మొదలు పెట్టింది టీమ్. అందులో భాగంగా ఈ సినిమా నుంచి అవైటెడ్ హై వోల్టేజ్ యాక్షన్ టీజర్‌ని (The Warrior) విడుదల చేసింది.
ఒకేసారి తెలుగుతో పాటు తమిళ భాషల్లో విడుదలై టీజర్ నెటిజన్స్ తెగ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో రామ్ పోలీస్ ఆఫీసర్‌గా అదరగొట్టారని టీజర్‌ను చూస్తుంటే తెలుస్తోంది. రామ్ లుక్ కూడా అదిరింది. ఆది పినిశెట్టిని విలన్‌గా కనిపించనున్నారు. కృతి శెట్టి క్యూట్‌గా మెరిసింది. ఈ సినిమా నుంచి విడుదల చేసిన బుల్లెట్ సాంగ్ తెలుగు, తమిళ వెర్షన్ కలిపి 100 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి సంచలనం రేపింది. దీంతో ఈ చిత్ర దర్శకుడు లింగుసామి.. లెజండరీ దర్శకుడు భారతీరాజాతో కలిసి చిందులు లేసాడు. తెలుగులో 60 మిలియన్ వ్యూస్ రాబడితే.. తమిళంలో 43 మిలియన్ వ్యూస్ రాబట్టింది. ఓవరాల్‌గా 100 మిలియన్ వ్యూస్ రాబట్టింది.
ఇక మరోవైపు తెలుస్తోన్న సమాచారం మేరకు తాజాగా ఈ చిత్రం (The Warriorr) హిందీ వెర్షన్ కి సంబంధించి ఓ భారీ డీల్ కుదిరింది. ఈ చిత్రం హిందీ డబ్బింగ్ రైట్స్ రూ. 16 కోట్ల రూపాయలకి అమ్ముడైనట్లు తెలుస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం పై శ్రీనివాస చిట్టూరీ ఈ (The Warriorr) చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఆది పినిశెట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ నటిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ (Ram Pothineni) తొలిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషలకు కలిపి డిస్నీ హాట్ స్టార్ రూ. 35 కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం. మొత్తంగా డిజిటల్, శాటిలైట్, డబ్బింగ్ రూపేణా.. నాన్ థియేట్రికల్‌గా ఈ సినిమాకు రూ. 41 కోట్ల లాభం విడుదలకు ముందే వచ్చింది.
‘ది వారియర్’ మూవీ సెట్స్ పై ఉండగానే.. రామ్ (Ram Pothineni) మరో సినిమాను మొదలు పెట్టారు. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపోందనుంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.