• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • RAM POTHINENI RED MOVIE 4 DAYS WORLDWIDE COLLECTIONS AND ITS ALMOST INCHING TOWARDS BREAKEVEN MARK PK

Ram RED 1st Weekend collections: ‘రెడ్’ సినిమా 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్..

Ram RED 1st Weekend collections: ‘రెడ్’ సినిమా 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్..

రామ్ రెడ్ Photo : Twitter

Ram RED 1st Weekend collections: రామ్ పోతినేని హీరోగా కిషోర్ తిరుమల తెరకెక్కించిన చిత్రం రెడ్. తమిళనాట హిట్ అయిన తడమ్ సినిమాను తెలుగులో రీమేక్ చేసారు. స్రవంతి రవికిషోర్ నిర్మించిన ఈ చిత్రానికి తొలిరోజు యావరేజ్ టాక్ వచ్చింది. కానీ కలెక్షన్స్ మాత్రం అదిరిపోయేలా ఉన్నాయి.

  • Share this:
రామ్ పోతినేని హీరోగా కిషోర్ తిరుమల తెరకెక్కించిన చిత్రం రెడ్. తమిళనాట హిట్ అయిన తడమ్ సినిమాను తెలుగులో రీమేక్ చేసారు. స్రవంతి రవికిషోర్ నిర్మించిన ఈ చిత్రానికి తొలిరోజు యావరేజ్ టాక్ వచ్చింది. కానీ కలెక్షన్స్ మాత్రం అదిరిపోయేలా ఉన్నాయి. 4 రోజుల్లో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 13 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మాస్‌లో భీభత్సమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న రామ్.. ఇప్పుడు రెడ్ సినిమాకు కూడా ఇదే కంటిన్యూ చేసాడు. ఆ మార్కెట్ ఇప్పుడు ఈ సినిమాకు పనికొచ్చింది. పైగా సంక్రాంతి సీజన్ కావడంతో బాగానే వసూలు చేసింది రెడ్. బరిలో రవితేజ క్రాక్.. విజయ్ మాస్టర్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బాగానే పోటీ ఇస్తున్నా కూడా రామ్ బాగానే వసూలు చేస్తున్నాడు. ఈ సినిమాకు మంచి వసూళ్లు వస్తుండటంతో నిర్మాతలు కూడా పండగ చేసుకుంటున్నారు. చాలా రోజుల తర్వాత థియేటర్స్‌లో వచ్చిన సినిమాలను పూర్తిస్థాయిలో రిసీవ్ చేసుకున్నారు ఆడియన్స్. దానికి సాక్ష్యంగానే ఇప్పుడు పండగ సినిమాలు తీసుకొస్తున్న కలెక్షన్స్. మరి 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఎంత వసూలు చేసింది..? జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత..? ఇంకా ఎంత రావాలి..?

నైజాం: 4.90 కోట్లు
వైజాగ్: 1.39 కోట్లు
ఈస్ట్: 98 లక్షలు
వెస్ట్: 91 లక్షలు
గుంటూరు: 96 లక్షలు
కృష్ణా: 93 లక్షలు
నెల్లూరు: 58 లక్షలు
(ఆంధ్ర): 5.75 కోట్లు షేర్
సీడెడ్: 2.45 కోట్లు
ఏపీ+తెలంగాణ 4 డేస్ కలెక్షన్స్ (షేర్): 13.10 కోట్లు

ఓవర్సీస్: 9 లక్షలు
రెస్ట్ ఆఫ్ ఇండియా: 40 లక్షలు
వరల్డ్ వైడ్ టోటల్: 13.59 కోట్లు (షేర్)

ప్రీ రిలీజ్ బిజినెస్ 16 కోట్లు..
Published by:Praveen Kumar Vadla
First published: