రామ్ పోతినేని రెడ్‌ డిజిటల్ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ భారీ ఆఫర్..

యంగ్ హీరో రామ్ ప్రధాన పాత్రలో కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ 'రెడ్'.

news18-telugu
Updated: May 4, 2020, 8:39 AM IST
రామ్ పోతినేని రెడ్‌ డిజిటల్ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ భారీ ఆఫర్..
రామ్ రెడ్ పోస్టర్ Photo : Twitter
  • Share this:
యంగ్ హీరో రామ్ ప్రధాన పాత్రలో కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ `రెడ్`. స్రవంతి రవికిషోర్ స్రవంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా తమిళ హిట్ చిత్రం `తడమ్` కు తెలుగు రీమేక్‌గా వస్తోంది. హీరో రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో నివేదా థామస్, మాళవిక శర్మ, అమృత అయ్యర్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. అయితే ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న రిలీజ్ చేయాలని ప్లాన్ చేసింది చిత్రబృందం. కానీ మహమ్మారి కరోనా వైరస్‌ కారణంగా ఈ చిత్రం విడుదల వాయిదా పడింది. కరోనా వల్ల దేశంలో మరణాలతో పాటు పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో లాక్ డౌన్ ప్రకటించారు. ఈ లాక్ డౌన్ కాస్తా ఏప్రిల్ 15తో ముగుస్తుందనుకుంటే.. ప్రస్తుతం లాక్ డౌన్‌ను మే 17వరకు పొడిగించారు. అయితే ఓ సినిమా అనుకున్న సమయానికి విడుదల కాకపోతే ఆ సినిమా మరిన్ని నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీంతో ఈ సినిమాను డిజిటల్‌లో విడుదల చేయనున్నారనే వార్తలు అప్పట్లో హల్ చల్ చేశాయి. ఈ వార్తల్నీ రామ్ తన సోషల్ మీడియా వేదికగా ఖండించాడు. కాగా మరోసారి ఈ సినిమా డిజిటల్‌ రైట్స్ గురించి మరోవార్త హల్ చల్ చేస్తోంది. అయితే ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యాక డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ప్రసారం చేసుకోవడానికి.. డిజిటల్ రైట్స్ కోసం ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్స్ పోటీ పడుతున్నాయట. అందులో భాగంగా నెట్ ఫ్లిక్స్ నుండి కాస్త పెద్ద ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. మరి చిత్రబృందం ఎవరికి డిజిటల్ రైట్స్‌ను కట్టబెడుతుందో చూడాలి.
First published: May 4, 2020, 8:39 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading