Ismart Shankar: బాలీవుడ్ వెళుతున్న ఇస్మార్ట్ శంకర్..

ఒక భాషలో హిట్టైన సినిమాను వేరే భాషలో రీమేక్ చేయడమనేది సినిమా పుట్టినప్పటి నుంచి ఉంది. తాజాగా ఇస్మార్ట్ శంకర్ మూవీని బాలీవుడ్‌లో రీమేక్ చేయనున్నారు.

news18-telugu
Updated: October 4, 2019, 9:02 PM IST
Ismart Shankar: బాలీవుడ్ వెళుతున్న ఇస్మార్ట్ శంకర్..
ఇస్మార్ట్ శంకర్
  • Share this:
ఒక భాషలో హిట్టైన సినిమాను వేరే భాషలో రీమేక్ చేయడమనేది సినిమా పుట్టినప్పటి నుంచి ఉంది. గత కొన్నేళ్లుగా తెలుగులో హిట్టైన సినిమాలు వరసగా హిందీలో రీమేకై మంచి సక్సెస్ సాధిస్తున్నాయి.ఇప్పటికే తెలుగులో హిట్టైన ‘క్షణం’‘టెంపర్’ వంటి సినిమాలు బాలీవుడ్‌లో రీమేక్ చేసిన సంగతి సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ‘ఎఫ్ 2’, ‘RX 100’ వంటి సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. తాజాగా తెలుగులో హిట్టైన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేయనున్నారు. బాలీవుడ్‌లో ఇస్మార్ట్ శంకర్‌గా రణ్‌వీర్ సింగ్ నటించనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన హక్కులను ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ భారీ రేటుకే కొనుగోలు చేసినట్టు సమాచారం. హిందీలో ఈ సినిమాను పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసే అవకాశాలున్నాయి. మొత్తానికి తెలుగు ప్రేక్షకులను ఇస్మార్ట్ శంకర్‌గా మెప్పించిన ఈ సినిమా బాలీవుడ్ ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి. ఈ బాలీవుడ్ రీమేక్‌కు కూడా ‘ఇస్మార్ట్ శంకర్’ అనే టైటిల్‌తోనే తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

First published: October 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>