news18-telugu
Updated: April 29, 2020, 12:47 PM IST
ఇస్మార్ట్ శంకర్ (Twitter/Photo)
పూరీ జగన్నాథ్, రామ్ కలయికలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయింది. పెట్టిన పెట్డుబడికి మూడింతల లాభాల్ని తీసుకొచ్చింది. గతేడాది విడుదలై ఎక్కువ లాభాలను తీసుకొచ్చిన చిత్రాల్లో ‘ఇస్మార్ట్ శంకర్’ ముందు వరుసలో ఉంది. చాలా రోజుల తర్వాత మాస్ ఆడియన్స్‌ని ఈ చిత్రం డాన్సులు చేయించింది. చాలా రోజుల తర్వాత థియేటర్లలో విజిల్స్, గోలలు చేస్తూ ఎంజాయ్ చేసిన సినిమా ఇస్మార్ట్ శంకర్. రామ్ కెరీర్లో కూడా తొలిసారి రూ.40 కోట్ల షేర్ ఈ చిత్రంతో అందుకున్నాడు. ఎన్టీఆర్‌తో చేసిన టెంపర్ తర్వాత సరైన సక్సెస్ లేని పూరీ జగన్నాథ్‌కు ఈ చిత్రం నిర్మాతగా, దర్శకుడిగా మంచి లాభాలని తీసుకొచ్చింది. ఇక రామ్ కూడా అంతే. చాలా ఏళ్ళ తర్వాత అసలైన బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమా టీవీలో ప్రసారం చేస్తే అదిరిపోయే టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి. అంతేకాదు ఈ సినిమాలో విడుదలైన ప్రతి పాట యూట్యూబ్‌లో అరాచకం సృష్టించాయి. తాజాగా ఈ చిత్రాన్ని హిందీలో డబ్ చేసి యూట్యూబ్‌లో ఫిబ్రవరి 16న విడుదల చేసారు. ఈ చిత్రం యూట్యూబ్‌లో అప్లోడ్ చేసి 24 గంటలు గడవక ముందే 11 మిలియన్ వ్యూస్ సంపాదించింది. తాజాగా ఈ చిత్రం యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్ సాధించింది.
అంటే 10 కోట్ల వ్యూస్ అన్నమాట. కేవలం నెలన్నర వ్యవధిలో 100 మిలియన్ వ్యూస్ సంపాదించడం అంటే మాములు విషయం కాదు. కేవలం 45 రోజుల్లోనే ఇన్ని వ్యూస్ సంపాదిస్తే.. ముందు ముందు యూట్యూబ్‌లో ఈ సినిమా ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి. మొత్తానికి రామ్ పోతినేని హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గరే కాదు.. యూట్యూబ్‌లో కూడా సంచలనాలకు వేదికగా నిలిచింది. ఈ చిత్రంలో రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్స్‌గా నటించిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం రామ్ హీరోగా రెడ్ సినిమా చేసాడు. ఇందులో తొలిసారి ద్విపాత్రాభినయం చేసాడు.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
April 29, 2020, 12:47 PM IST