Hero Ram - Linguswamy: ఇద్దరు కోలీవుడ్ దర్శకులకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చిన రామ్‌.. బన్నీ వదిలేసిన దర్శకుడితో రామ్‌ సినిమా

Ram Pothineni movies with two Tamil directors confirmed and one is with director rejected by Allu Arjun

Hero Ram - Linguswamy: టాలీవుడ్‌ హీరో రామ్‌ ఇద్దరు కోలీవుడ్ దర్శకులతో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటునట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరిలో పందెంకోడి ఫేమ్‌ లింగుస్వామి ఒకరు కావడం గమనార్హం. బన్నీ వద్దనుకున్న దర్శకుడితో రామ్‌ సినిమా చేయడమేంటనే వార్తలు వినిపిస్తున్నాయి.

  • Share this:
    ఈ ఏడాది సంక్రాంతికి 'రెడ్‌' సినిమాతో సందడి చేశాడు హీరో రామ్‌. ఈ యువ కథానాయకుడు చాలా నింపాదిగా సినిమాలు చేస్తుంటాడు. స్క్రిప్ట్స్‌ ఎంపికలో ఏమాత్రం తొందరను అసలు చూపించడు. అందుకనే 'రెడ్‌' సినిమా తర్వాత రామ్‌ ఏ సినిమా చేస్తాడనే దానిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయితే రామ్‌ ప్లానింగ్‌ మాత్రం మరో రేంజ్‌లో ఉంది. ఇతర హీరోలను ఫాలో అవుతూ ఇప్పటి వరకు టాలీవుడ్‌కే పరిమితమైన హీరో రామ్‌ తన తదుపరి సినిమాను తెలుగులోనే కాదు తమిళంలోనూ విడుదల చేయాలని అనుకుంటున్నాడట. అందులో భాగంగా సీఆరి ఏకంగా కోలీవుడ్ దర్శకుడితో రామ్‌ సినిమా చేయాలని అనుకుంటున్నాడట. ఇండస్ట్రీలో వినిపిస్తోన్న సమాచారం మేరకు హీరో రామ్‌ ఇద్దరు కోలీవుడ్‌ దర్శకులను లైన్‌లో పెట్టాడట. ఒకరు లింగుస్వామి కాగా.. మరో దర్శకుడు నేసన్‌. వీరిద్దరిలో ముందుగా లింగుస్వామి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడట రామ్‌.

    దర్శకుడు లింగుస్వామి పేరు వినగానే తెలుగు ప్రేక్షకుడికి ఠక్కున గుర్తుకొచ్చే సినిమా పందెం కోడి. ఈ సినిమా తర్వాత లింగుస్వామికి ఆ రేంజ్‌లో బ్రేక్‌ దొరకలేదు. అయితే లింగుస్వామి మాత్రం తెలుగు హీరోలతో ద్విభాషా చిత్రం చేయాలని గట్టిగానే ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. అందులో భాగంగా స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌తోనూ ఆ మధ్య ఓ సినిమాను స్టార్ట్‌ చేసినప్పటికీ ఆ సినిమా ఆగిపోయిన సంగతి తెలిసిందే. తర్వాత సైలెంట్‌గా ఉండిపోయిన లింగుస్వామి ఈ సారి ఏకంగా హీరో రామ్‌ను లైన్లో పెట్టేశాడట. శ్రీనివాస్‌ చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడట. ఇప్పటికే కథా చర్చలు జరిగిపోయాయని, ఏప్రిల్‌ నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వెళుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

    మరోవైపు నేసన్‌ సినిమాను కూడా రామ్‌ చేయడానికి ఓకే చెప్పేశాడట. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌లో రామ్‌, నేసన్‌ సినిమా నిర్మితం కానుందని అంటున్నారు. త్వరలోనే ఈ రెండు సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు వెలువడతాయని వార్తలు వినిపిస్తున్నాయి.
    Published by:Anil
    First published: