RAM POTHINENI LINGUSWAMY KRITHI SHETTY THE WARRIORR FILM HINDI RIGHTS GETS GOOD PRICE HERE ARE THE DETAILS SR
Ram Pothineni | The Warriorr : రామ్ ది వారియర్ హిందీ డబ్బింగ్ రైట్స్‌కు భారీ ఆఫర్..
రామ్ పోతినేని The Warrior Photo : Twitter
Ram Pothineni | The Warriorr : టాలీవుడ్ యువ హీరో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni)రెడ్ సినిమా తర్వాత తమిళ డైరెక్టర్ లింగుసామితో ది వారియర్ అంటూ ఓ పోలీస్ యాక్షన్ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే.
టాలీవుడ్ యువ హీరో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni)రెడ్ సినిమా తర్వాత తమిళ డైరెక్టర్ లింగుసామితో ది వారియర్ అంటూ ఓ పోలీస్ యాక్షన్ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి (krithi shetty)హీరోయిన్గా నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల రామ్ లుక్ ఒకటి విడుదలై సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. కాగా తెలుస్తోన్న సమాచారం మేరకు తాజాగా ఈ చిత్రం హిందీ వెర్షన్ కి సంబంధించి ఓ భారీ డీల్ జరిగినట్లు టాక్. ఈ చిత్రం హిందీ డబ్బింగ్ రైట్స్ 16 కోట్ల రూపాయల కి అమ్ముడైనట్లు తెలుస్తోంది. . దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం పై శ్రీనివాస చిట్టూరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇటీవల ఈ చిత్రం రెండో షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని మూడో షెడ్యూల్‌ను మొదలు పెట్టింది. ఈ సినిమాలో రామ్ పోలీస్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
ఆది పినిశెట్టి కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమా ఆడియో రైట్స్ రికార్డ్ ధరకు అమ్ముడు పోయాయని తెలుస్తోంది. ఆడియో హక్కులకు ఆదిత్య మ్యూజిక్ సంస్థ భారీ ధర చెల్లించి దక్కిచుకున్నట్లు సమాచారం.
ఈ సినిమా పాటల్ని ఆదిత్య మ్యూజిక్ రూ.2.75కోట్లు వెచ్చించనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో రామ్ కి ఇది కెరీర్ బెస్ట్‌గా నిలుస్తుంది. ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు.
రామ్ ఈ సినిమా ఇలా ఉండగానే మరో సినిమాకు కూడా ఓకే అన్నట్లు తెలుస్తోంది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ ఓ సినిమాలో నటించనున్నట్టు టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. బోయపాటి ఇటీవల నందమూరి బాలకృష్ణతో 'అఖండ' అనే సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. వారియర్ సినిమాతో పాటు రామ్, బోయపాటితో సినిమాను కూడా చేయనున్నారని అంటున్నారు. ఇక వారియర్ సినిమా దర్శకుడు లింగుసామి విషయానికి వస్తే.. ఆయన గతంలో రన్, పందేంకోడి, ఆవారా వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించారు. లింగుసామి మాస్ చిత్రాలకు మన తెలుగులో కూడా మంచి ఆదరణ ఉంది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.