Ram Pothineni : రెండో షెడ్యూల్ పూర్తి చేసుకున్న రామ్ పోతినేని లింగుసామి చిత్రం..

Linguswamy, Ram Pothineni and Krithi Shetty Photo : Twitter

Ram Pothineni : టాలీవుడ్ యువ హీరో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని రెడ్ సినిమా తర్వాత తమిళ డైరెక్టర్ లింగుసామితో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం తాజాగా రెండో షెడ్యూల్ పూర్తి చేసుకున్నట్లు చిత్రంబృందం ప్రకటించింది.

  • Share this:
    టాలీవుడ్ యువ హీరో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని  (Ram Pothineni)రెడ్ సినిమా తర్వాత తమిళ డైరెక్టర్ లింగుసామితో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి  (krithi shetty)హీరోయిన్‌గా నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం.. తాజాగా రెండో షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఇక ఇటీవల జిమ్‌లో కసరత్తులు చేస్తూ.. రామ్‌ స్వల్పంగా గాయపడిన సంగతి తెలిసిందే. రామ్‌ గాయం నుంచి కోలుకోగానే కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్‌ పోలీస్‌గా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఆది పినిశెట్టి కీలకపాత్రలో కనిపించనున్నారు. #RAPO19 అనే వర్కింగ్ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా ఆడియో రైట్స్ రికార్డ్ ధరకు అమ్ముడు పోయాయని తెలుస్తోంది. ఆడియో హక్కులకు ఆదిత్య మ్యూజిక్ సంస్థ భారీ ధర చెల్లించి దక్కిచుకున్నట్లు సమాచారం.

    ఈ సినిమా పాటల్ని ఆదిత్య మ్యూజిక్ రూ.2.75కోట్లు వెచ్చించనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో రామ్‌ కి ఇది కెరీర్‌ బెస్ట్‌గా నిలుస్తుంది. ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాస్‌ చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు అప్పుడే టైటిల్ కూడా ఖరారు కూడా అయినట్లు తెలుస్తోంది. ఇస్మార్ట్ శంకర్‌తో మాస్ ప్రేక్షకులకు దగ్గరైన రామ్.. కొత్త సినిమాకు ఉస్తాద్ అనే పేరును పరిశీలిస్తున్నారట.



    ఇక ఈ సినిమా దర్శకుడు లింగుసామి విషయానికి వస్తే.. ఆయన గతంలో రన్, పందేంకోడి, ఆవారా వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించారు. లింగుసామి మాస్ చిత్రాలకు మన తెలుగులో కూడా మంచి ఆదరణ ఉంది.

    Keerthy Suresh: యాంకర్ గా మారబోతున్న కీర్తి సురేష్..! నాలుగు భాషల్లో ఇలా..




    Akhil Akkineni : అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ మూడో రోజు రాక్ సాలిడ్ కలెక్షన్స్.. ఇది ఎవరు ఊహించనిదే..

    రామ్ ఈ సినమా ఇలా ఉండగానే మరో సినిమాకు కూడా ఓకే అన్నట్లు తెలుస్తోంది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌ ఓ సినిమాలో నటించనున్నట్టు టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. బోయపాటి ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో 'అఖండ' అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే రామ్‌తో సినిమా చేయడానికి బోయపాటి ఓ మాస్ కథను సిద్ధం చేశారని సమాచారం. దీనిపై అధికారిక సమచారం వెలువడాల్సి ఉంది.
    Published by:Suresh Rachamalla
    First published: