Ram Pothineni : రామ్ పోతినేని లింగుసామి చిత్రానికి భలే గిరాకీ.. భారీ ధరకు ఆడియో రైట్స్..

Linguswamy, Ram Pothineni and Krithi Shetty Photo : Twitter

Ram Pothineni : టాలీవుడ్ యువ హీరో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని రెడ్ సినిమా తర్వాత ఇటీవలే తమిళ డైరెక్టర్ లింగుసామితో ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Share this:
    టాలీవుడ్ యువ హీరో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని రెడ్ సినిమా తర్వాత ఇటీవలే తమిళ డైరెక్టర్ లింగుసామితో ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమా ఇటీవలే షూటింగ్‌ను స్టార్ట్ చేసింది. అది అలా ఉంటే ఈ సినిమా గురించి మరో ఆసక్తికర అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. #RAPO19 అనే వర్కింగ్ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా ఆడియో రైట్స్ రికార్డ్ ధరకు అమ్ముడు పోయాయని తెలుస్తోంది. ఆడియో హక్కులకు ఆదిత్య మ్యూజిక్ సంస్థ భారీ ధర చెల్లించి దక్కిచుకున్నట్లు సమాచారం. ఆదిత్య మ్యూజిక్ రూ.2.75కోట్లు వెచ్చించనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో రామ్‌ కి ఇది కెరీర్‌ బెస్ట్‌గా నిలుస్తుంది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. రామ్‌ సరసన కృతిశెట్టి నటిస్తోంది. మరో ముఖ్య పాత్రలో ఆది పినిశెట్టి నటిస్తున్నారు. ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాస్‌ చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుపుకుంటుంది.

    ఇక ఈ సినిమాకు అప్పుడే టైటిల్ కూడా ఖరారు కూడా అయినట్లు తెలుస్తోంది. ఇస్మార్ట్ శంకర్‌తో మాస్ ప్రేక్షకులకు దగ్గరైన రామ్.. కొత్త సినిమాకు ఉస్తాద్ అనే పేరును పరిశీలిస్తున్నారట.

    ఇది కూడా చూడండి : మోనాల్‌ గజ్జర్‌కు బంపర్ ఆఫర్.. నాగార్జున సినిమాలో అలా కనిపించనుందట..

    ఇక ఈ సినిమా దర్శకుడు లింగుసామి విషయానికి వస్తే.. ఆయన గతంలో రన్, పందేంకోడి, ఆవారా వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించారు. లింగుసామి మాస్ చిత్రాలకు మన తెలుగులో కూడా మంచి ఆదరణ ఉంది.

    రామ్ ఈ సినమా ఇలా ఉండగానే మరో సినిమాకు కూడా ఓకే అన్నట్లు తెలుస్తోంది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌ ఓ సినిమాలో నటించనున్నట్టు టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. బోయపాటి ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో 'అఖండ' అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే రామ్‌తో సినిమా చేయడానికి బోయపాటి ఓ మాస్ కథను సిద్ధం చేశారని సమాచారం. దీనిపై అధికారిక సమచారం వెలువడాల్సి ఉంది.
    Published by:Suresh Rachamalla
    First published: