Home /News /movies /

RAM POTHINENI LINGUSAMY MOVIE AADHI PINISETTY PLAY CRUCIAL ROLE OFFICIALLY ANNOUNCED TA

Ram Pothineni - Aadhi Pinisetty: రామ్ పోతినేని, లింగుసామి సినిమాలో కీలక పాత్రలో ఆది పినిశెట్టి..

రామ్ లింగుసామి సినిమాలో  ఆది పినిశెట్టి (Twitter/Photo)

రామ్ లింగుసామి సినిమాలో ఆది పినిశెట్టి (Twitter/Photo)

Ram Pothineni - Aadhi Pinisetty: రామ్ పోతినేని, లింగుసామి సినిమాలో కీలక పాత్రలో ఆది పినిశెట్టి వివరాల్లోకి వెళితే..

    Ram Pothineni: రామ్ పోతినేని, లింగుసామి సినిమాలో కీలక పాత్రలో ఆది పినిశెట్టి నటించనున్నట్టు చిత్ర వర్గాలు అఫీషియల్‌గా ప్రకటించారు. వివరాల్లోకి వెళితే.. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఎన్నో అంచనాల మధ్య విడుదలైన రామ్ పోతినేని ‘రెడ్’ (Red)మూవీ ఈ యేడాది సంక్రాంతి కానుకగా విడుదలై అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. దీంతో తమిళ దర్శకుడు లింగుసామి (Lingusamy)చెప్పిన కథకు రామ్ ఓకే చెప్పారు. ఈయన గతంలో లింగుసామి అల్లు అర్జున్‌తో ఓ సినిమా0 చేద్దామనుకున్నారు. కానీ ఎందుకో వర్కౌట్ కాలేదు. ఇపుడు అదే స్టోరీని కొంచెం మార్పులు చేర్పలతో రామ్‌‌ని ఒప్పించినట్టు సమాచారం. ఈ చిత్రంలో కృతి శెట్టి (Krithi Shetty) కథానాయికగా నటిస్తోంది.  ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ రీసెంట్‌గా ప్రారంభమైంది. ఈ షెడ్యూల్లో హైదరాబాద్‌లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. కృతి శెట్టి నెక్ట్స్ షెడ్యూల్లో ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొననుంది.  ఈ సినిమాకు ‘ఉస్తాద్’ అనే టైటిల్ ఖరారైనట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఫిల్మ్ చాంబర్‌లో ‘ఉస్తాద్’ టైటిల్‌ కూడా రిజిస్టర్ చేసారు.  హీరోగా రామ్ పోతినేని(Ram Pothineni) కి ఇది 19వ సినిమా.

    ఇస్మార్ట్ శంకర్‌తో మాస్ ప్రేక్షకులకు దగ్గరైన రామ్.. ఈ సినిమాతో ఉస్తాద్ రామ్ గా మారారు. ఇపుడు అదే టైటిల్‌ను ఈ సినిమాకు  పెట్టబోతున్నట్టు సమాచారం.  ఈ చిత్రంలో ఆది పినిశెట్టి కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా ఆది పినిశెట్టికి చిత్ర యూనిట్ స్వాగతం పలికింది. ఇక ఆది పినిశెట్టి తెలుగులో నటించిన ‘సరైనోడు’, ‘రంగస్థలం’, ‘నిన్ను కోరి’ వంటి సినిమాలతో దగ్గరయ్యారు. ఈ సినిమాలో ఆది పినిశెట్టి ఎలాంటి పాత్ర చేయనున్నాడో చూడాలి. విలన్ పాత్ర లేకుంటే.. కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించనున్నాడా అనేది చూడాలి.


    ఇక రామ్ పోతినేనితో సినిమా చేస్తోన్న దర్శకుడు లింగుసామి విషయానికి వస్తే.. ఆయన గతంలో రన్, పందేంకోడి, ఆవారా వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించారు. లింగుసామి మాస్ చిత్రాలకు మన తెలుగులో కూడా మంచి ఆదరణ లభించింది. దీనితో ఈ కాంబో నుంచి సినిమా ప్రకటన రావడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఒకేసారి తెలుగు, తమిళ భాషాల్లో ఏక కాలంలో బై లింగువల్ చిత్రంగా దీనిని రూపోందనుంది. ఈ సినిమాను ఎస్ ఎస్ స్క్రీన్స్ బ్యానర్ లో శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Aadhi Pinisetty, Lingusamy, Ram Pothineni, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు