హోమ్ /వార్తలు /సినిమా /

Ram Pothineni | The Warriorr: రామ్ పోతినేని ది వారియర్ ఎలా ఉంది.. ట్విట్టర్ టాక్..

Ram Pothineni | The Warriorr: రామ్ పోతినేని ది వారియర్ ఎలా ఉంది.. ట్విట్టర్ టాక్..

Ram Pothineni The Warriorr Photo : Twitter

Ram Pothineni The Warriorr Photo : Twitter

Ram Pothineni The Warriorr Twitter Talk : రామ్ పోతినేని, కృతి శెట్టి హీరో, హీరోయిన్లుగా ఆది పినిశెట్టి విలన్‌గా నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీ ‘ది వారియర్’. తెలుగు, తమిళ భాషల్లో బై లింగ్వల్‌గా తెరకెక్కించారు. లింగు సామి దర్శకత్వం వహించారు. టీజర్స్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి అంచనాలు నడుమ ఈ సినిమా జూలై 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.

ఇంకా చదవండి ...

  Ram Pothineni The Warriorr Twitter Review : రామ్ పోతినేని, కృతి శెట్టి (Krithi Shetty) హీరో, హీరోయిన్లుగా ఆది పినిశెట్టి విలన్‌గా నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీ (Ram Pothineni The Warriorr) ‘ది వారియర్’.  తెలుగు, తమిళ భాషల్లో బై లింగ్వల్‌గా తెరకెక్కించారు. లింగు సామి దర్శకత్వం వహించారు. టీజర్స్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి అంచనాలు నడుమ ఈ సినిమా జూలై 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సినిమాకి ప్రివ్యూస్ లేవు. అంతేకాదు ఒకేసారి అమెరికా, ఇండియాలో  విడుదలకానుంది. దీంతో టాక్ ఇంకా బయటకు రాలేదు. అయితే ముందస్తు టాక్‌ ఏమంటే.. సెన్సార్‌ రిపోర్ట్.. ట్విట్టర్‌లో వస్తోన్న టాక్‌ ప్రకారం.. సినిమా పూర్తి మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సాగుతుందని అంటున్నారు. రామ్‌ తమిళంలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తున్నందునా దర్శకుడు లింగుస్వామి `ది వారియర్‌` (The Warriorr) కథని అంతే మంచి పవర్‌ఫుల్‌ మాస్ యాక్షన్ ఎపిసోడ్స్‌ ఉండేటట్టు డిజైన్‌ చేశారట. అందులో భాగంగా ఫస్టాఫ్‌ కాస్తా ఫన్నీగా.. సెకండాఫ్‌‌లో ఉండే సీన్స్ ఓ రేంజ్‌లో ఉంటాయని అంటున్నారు. ఇక యాక్షన్‌ ఎపిసోడ్‌లు పూనకాలు తెప్పించేలా ఉంటాయని టాక్. రామ్‌కు (Ram Pothineni )మంచి హిట్ సినిమా అవుతుందని.. అలాగే దర్శకుడు లింగుస్వామికిది మంచి కమ్‌ బ్యాక్‌ సినిమా అవుతుందని ట్విట్టర్‌ టాక్ నడుస్తోంది. చూడాలి మరి సినిమా పరిస్థితి ఎలా ఉండనుందో.. ఒరిజినల్ టాక్ 11 గంటలవరకు బయటకు రానుంది.

  ఇక ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ (The Warriorr)  సినిమాను రామ్ కెరీర్‌లోనే అత్యధిక థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ది వారియర్ సినిమాను తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సస్‌లో భారీ ఎత్తున విడుదల కాబోతుంది. తెలంగాణ (నైజాం)లో 250 పైగా థియేటర్స్.. రాయలసీమ (సీడెడ్)లో 145 + ఆంధ్ర ప్రదేశ్ 300 + తెలంగాణ + ఆంధ్రప్రదేశ్ కలిపి 700 పైగా స్క్రీన్స్‌లో విడుదల కాబోతంది. ఒక కర్ణాటక + రెస్టాఫ్ భారత్ + తమిళనాడు కలిపి 230 పైగా స్క్రీన్స్‌లో విడుదలవతోంది. ఇక ఓవర్సీస్‌లో 350 పైగా స్క్రీన్స్‌లో విడుదలవుతోంది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా 1280 పైగా స్క్రీన్స్‌లో ’ది వారియర్’ మూవీ విడుదల కాబోతుంది.

  ‘ది వారియర్’  చిత్రంలో రామ్ తొలిసారి పోలీస్ పాత్రలో నటించారు. ఈ సినిమాలో రామ్ సరసన ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి  (krithi shetty)నటించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక ‘ది వారియర్’ సినిమా టిక్కెట్ రేట్ల విషయంలో  చిత్ర యూనిట్ ఓ నిర్ణయం తీసుకుంది.  ఈ సినిమాకు తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 175, మల్టీఫ్లెక్స్‌లో రూ. 295గా నిర్ణయించారు. ఇక ఏపీలో సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 147, మల్టీఫ్లెక్స్‌లో రూ.  177 గా నిర్ణయించారు. అయితే ఇటీవల విడుదలైన సినిమాలకు థియేటర్ రెస్పాన్స్ అంతంతమాత్రమే.. కంటెంట్ బాగున్నా అధిక ధరల వల్ల జనాలు థియేటర్స్‌కే రావడం మానేశారు. ది వారియర్ టికెట్లు ఈ రేంజ్‌లో ఉంటే సామాన్యలు థియేటర్‌కు రావడం కష్టమే అంటున్నారు నెటిజన్స్. అయితే కంటెంట్ బాగుంటే ఓకే కానీ.. లేకపోతే.. థియేటర్స్ ఖాళీగా ఉండాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు.

  ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే.. తెలంగాణ (నైజాం) : రూ. 11 కోట్లు రాయలసీమ (సీడెడ్) : రూ. 6 కోట్లు ఆంధ్ర ప్రదేశ్ : రూ. 17 కోట్లు కర్ణాటక + రెస్టాఫ్ భారత్ :రూ. 2 కోట్లు ఓవర్సీస్ : రూ. 2.10 కోట్లు తమిళ వెర్షన్ : రూ. 5 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా రూ. 43.10 కోట్లు.. తెలుగులో 38.10 కోట్లకు అమ్ముడుపోయింది. ఈ సినిమా తెలుగులో హిట్ అనిపించుకోవాలంటే రూ. 39 కోట్లు రాబట్టాలి. ఓవరాల్‌గా తమిళంలో కలుపుకుంటే.. రూ. 44 కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ అవుతోంది. కానీ ఏపీ, తెలంగాణలో రూ. 4 కోట్లకు తగ్గించారు. తమిళ వెర్షన్ రూ. 5 కోట్ల నుంచి రూ. 4 కోట్లకు తగ్గించారు. మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.10 కోట్లకు తగ్గించారు. ఓవరాల్‌గా రూ. 39 కోట్లు వస్తే ఈ సినిమా బ్రేక్ పూర్తి చేసుకొని హిట్ అనిపించుకుంటోంది.

  మరోవైపు  ఈ చిత్రం (The Warriorr) హిందీ వెర్షన్ కి సంబంధించి ఓ భారీ డీల్ కుదిరింది. ఈ చిత్రం హిందీ డబ్బింగ్ రైట్స్ రూ.  16 కోట్ల రూపాయలకి అమ్ముడైనట్లు తెలుస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం పై శ్రీనివాస చిట్టూరీ ఈ (The Warriorr) చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషలకు కలిపి డిస్నీ హాట్ స్టార్ రూ. 35 కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం. మొత్తంగా డిజిటల్, శాటిలైట్, డబ్బింగ్ రూపేణా.. నాన్ థియేట్రికల్‌గా ఈ సినిమాకు రూ. 41 కోట్ల లాభం విడుదలకు ముందే వచ్చింది. ఇక ‘ది వారియర్’ మూవీ సెట్స్ పై ఉండగానే.. రామ్ (Ram Pothineni)  మరో సినిమాను మొదలు పెట్టారు. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కనుంది.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Krithi shetty, Ram Pothineni, The Warrior, Tollywood news

  ఉత్తమ కథలు