Home /News /movies /

Ram Pothineni - Lingusamy: రామ్ పోతినేని, లింగుసామి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం..

Ram Pothineni - Lingusamy: రామ్ పోతినేని, లింగుసామి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం..

రామ్ పోతినేని, కృతిశెట్టి,లింగుసామిల షూటింగ్ ప్రారంభం (Twitter/Photo)

రామ్ పోతినేని, కృతిశెట్టి,లింగుసామిల షూటింగ్ ప్రారంభం (Twitter/Photo)

Ram Pothineni - Krithi Shetty - Lingusamy | రామ్ పోతినేని, కృతి శెట్టి హీరో, హీరోయిన్లుగా లింగుసామి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు ప్రారంభమైనట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.

    Ram Pothineni - Lingusamy: ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఎన్నో అంచనాల మధ్య విడుదలైన రామ్ పోతినేని ‘రెడ్’ (Red)మూవీ సంక్రాంతికి విడుదలై అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. దీంతో తమిళ దర్శకుడు లింగుసామి (Lingusamy)చెప్పిన కథకు రామ్ ఓకే చెప్పారు. ఈయన గతంలో ఓ తెలుగు అగ్ర హీరోతో చేద్దామనుకున్నారు. కానీ ఎందుకో వర్కౌట్ కాలేదు. ఇపుడు అదే స్టోరీని కొంచెం మార్పులు చేర్పలతో రామ్‌‌ని ఒప్పించారు. ఈ చిత్రంలో కృతి శెట్టి (Krithi Shetty) కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు ప్రారంభమైనట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ షెడ్యూల్లో హైదరాబాద్‌లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. కృతి శెట్టి నెక్ట్స్ షెడ్యూల్లో ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొననుంది.  ఈ సినిమాకు ‘ఉస్తాద్’ అనే టైటిల్ ఖరారైనట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఫిల్మ్ చాంబర్‌లో ‘ఉస్తాద్’ టైటిల్‌ కూడా రిజిస్టర్ చేసారు.  హీరోగా రామ్ పోతినేని(Ram Pothineni) కి ఇది 19వ సినిమా.

    ఇస్మార్ట్ శంకర్‌తో మాస్ ప్రేక్షకులకు దగ్గరైన రామ్.. ఈ సినిమాతో ఉస్తాద్ రామ్ గా మారారు. ఇపుడు అదే టైటిల్‌ను ఈ సినిమాకు  పెట్టబోతున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమా దర్శకుడు లింగుసామి విషయానికి వస్తే.. ఆయన గతంలో రన్, పందేంకోడి, ఆవారా వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించారు. లింగుసామి మాస్ చిత్రాలకు మన తెలుగులో కూడా మంచి ఆదరణ లభించింది. దీనితో ఈ కాంబో నుంచి సినిమా ప్రకటన రావడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఒకేసారి తెలుగు, తమిళ భాషాల్లో ఏక కాలంలో బై లింగువల్ చిత్రంగా దీనిని రూపోందనుంది. ఈ సినిమాను ఎస్ ఎస్ స్క్రీన్స్ బ్యానర్ లో శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.



    అది అలా ఉంటే రామ్ మరో సినిమాకు కూడా ఓకే అన్నట్లు తెలుస్తోంది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌ ఓ సినిమాలో నటించనున్నట్టు టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. దీంతో పాటు అనిల్ రావిపూడి, త్రివిక్రమ్‌తో పాటు మురగదాస్‌తో ఓ డిఫరెంట్ మూవీ చేయబోతున్నట్టు సమాచారం.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Krithi shetty, Lingusamy, Ram Pothineni, Tollywood, Ustaad

    తదుపరి వార్తలు