వైరల్ అవుతున్న ఇస్మార్ట్ శంకర్ ‘దిమాక్ ఖరాబ్’ వీడియో సాంగ్..

ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో సంచలన విజయం సాధించిన చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. పూరీ జగన్నాథ్, రామ్ కలయికలో వచ్చిన ఈ చిత్రం అనూహ్యంగా బ్లాక్ బస్టర్ అయింది. మాస్ ఆడియన్స్‌ని ఈ చిత్రం డాన్సులు చేయించింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 20, 2019, 6:16 PM IST
వైరల్ అవుతున్న ఇస్మార్ట్ శంకర్ ‘దిమాక్ ఖరాబ్’ వీడియో సాంగ్..
దిమాక్ ఖరాబ్ సాంగ్ (Source: Youtube)
  • Share this:
ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో సంచలన విజయం సాధించిన చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. పూరీ జగన్నాథ్, రామ్ కలయికలో వచ్చిన ఈ చిత్రం అనూహ్యంగా బ్లాక్ బస్టర్ అయింది. మాస్ ఆడియన్స్‌ని ఈ చిత్రం డాన్సులు చేయించింది. చాలా రోజుల తర్వాత థియేటర్లలో విజిల్స్, గోలలు చేస్తూ ఎంజాయ్ చేసిన సినిమా ఇస్మార్ట్ శంకర్. రామ్ కెరీర్‌లో కూడా తొలిసారి 40 కోట్ల షేర్‌కు చేరువగా వచ్చిన సినిమా ఇది. 11 ఏళ్లుగా సరైన బ్లాక్ బస్టర్ లేని పూరీకి ఈ చిత్రం నిర్మాతగా, దర్శకుడిగా మంచి లాభాలని తీసుకొచ్చింది. ఇక రామ్ కూడా అంతే. చాలా ఏళ్ళ తర్వాత అసలైన బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.

సినిమా వచ్చి ఇన్ని నెలలవుతున్నా కూడా వీడియో సాంగ్స్ విడుదల చేయలేదని అభిమానులు గోల పెడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఈ కరువు తీరుస్తూ ఇందులో దిమాక్ ఖరాబ్ వీడియో సాంగ్ విడుదలైంది. నిధి అగర్వాల్, నభా నటాషా అందాల ఆరబోతతో ఈ పాట మాస్‌కు పిచ్చెక్కించింది. విడుదలైన క్షణం నుంచి యూ ట్యూబ్‌లో సంచలనాలు రేపుతుంది దిమాక్ ఖరాబ్ సాంగ్. శేఖర్ మాస్టర్ దీనికి కొరియోగ్రఫీ చేశాడు. జులై 18న విడుదలైన ఇస్మార్ట్ శంకర్ 38 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో పూరీ తన తర్వాతి సినిమా చేస్తున్నాడు. మరోవైపు రామ్ మాత్రం ఇంకా కథల వేటలోనే ఉన్నాడు.
First published: September 20, 2019, 6:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading