• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • RAM POTHINENI ISMART SHANKAR FAME GRAND FATHER PASSES AWAY DUE TO AGE FACTOR TA

Ram Pothineni: ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని ఇంట్లో తీవ్ర విషాదం..

Ram Pothineni: ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని ఇంట్లో తీవ్ర విషాదం..

రామ్ పోతినేని ఇంట్లో విషాదం (Twitter/Photo)

Ram Pothineni: సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.  భాషా భేదం లేకుండా  అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీల్లో ఒక్కొక్కరుకు కన్నుమూస్తున్నారు. చాలా మంది కరోనా కాటుకు బలైపోతున్నారు. ఏదో కొద్ది మంది మాత్రమే ఏజ్ ఫ్యాక్టర్‌తో కన్నుమూస్తున్నారు.తాజాగా హీరో రామ్ పోతినేని ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.

  • Share this:
    Ram Pothineni: సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.  భాషా భేదం లేకుండా  అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీల్లో ఒక్కొక్కరుకు కన్నుమూస్తున్నారు. చాలా మంది కరోనా కాటుకు బలైపోతున్నారు. ఏదో కొద్ది మంది మాత్రమే ఏజ్ ఫ్యాక్టర్‌తో కన్నుమూస్తున్నారు.తాజాగా హీరో రామ్ పోతినేని ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. రామ్ తాతయ్య ఈ మంగళవారం కన్నుమూసారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా తెలియజేస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా రామ్ పోతినేని తమ తాతయ్య కుటుంబం కోసం ఎంతో కష్టపడినట్టు చెప్పుకొచ్చారు.

    రామ్ వాళ్ల తాతగారు.. విజయవాడలో ఓ లారీ డ్రైవర్‌గా జీవితాన్ని ప్రారంభించి అంచలంచెలుగా ఎదిగారు. ఆయన జీవితం మాకు ఎన్నో పాఠాలు నేర్పిందన్నారు. ఫ్యామిలీ సభ్యులకు అన్ని వసతులు అందించడం కోసం ఆయన లారీ టైర్లపైనే నిద్రపోయేవారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మీరు రాజు లాంటి వారు. జేబులో ఉన్న డబ్బును బట్టి ఎవరు ఐశ్వర్యవంతులు కాలేరని, కేవలం మంచి మనసు వల్లే ప్రతి ఒక్కరు ధనవంతులు అవుతారని మీరే మాకు నేర్పించారన్నారు.




    మీ సంతానం ఇపుడు ఈ పొజిషినలో ఉందంటే అందకు మీరే కారణం అన్నారు. మీ లేరని తెలిసి నా మనసు ఎంతగానో కలిచిపోయింది. నా హృదయం కకావికలమైంది. మీ పవిత్ర ఆత్మ శాంతి చూకూరాలని ఆశిస్తున్నానంటూ రామ్ తాతా తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    అగ్ర కథనాలు