తమిళంలో సినిమా చేయడానికి రెడీ అంటోన్న రామ్ పోతినేని..

హీరో రామ్ పోతినేని ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న క్రైమ్ థ్రిల్లర్ `రెడ్` లో నటిస్తున్నాడు.

news18-telugu
Updated: May 11, 2020, 2:53 PM IST
తమిళంలో సినిమా చేయడానికి రెడీ అంటోన్న రామ్ పోతినేని..
రామ్ పోతినేని Photo : Twitter
  • Share this:
హీరో రామ్ పోతినేని ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న క్రైమ్ థ్రిల్లర్ `రెడ్` లో నటిస్తున్నాడు. ఈ సినిమాను స్రవంతి రవికిషోర్ స్రవంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించారు. రెడ్ తమిళ హిట్ చిత్రం `తడమ్` కు తెలుగు రీమేక్‌గా వస్తోంది. హీరో రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో నివేదా థామస్, మాళవిక శర్మ, అమృత అయ్యర్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. అది అలా ఉంటే ఆయన ఎప్పటినుండో ఓ స్ట్రెయిట్ తమిళ సినిమా చేయాలనీ చూస్తున్నాడట. అన్నీ కుదిరితే ఓ తమిళ్ మూవీ చేయడానికి సిద్ధం అని రామ్ తాజా ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చెన్నైలో పుట్టి పెరిగిన వాడిగా నాకు తమిళ భాషపై పట్టు వుంది. దానికి తోడు తమిళ సినిమా పై గౌరవం, ఆ పరిశ్రమలో మూవీ చేయాలని కోరిక ఉన్నాయని పేర్కోన్నాడు. సో మనం అతి త్వరలో రామ్ తమిళ ఎంట్రీ చూడోచ్చన్న మాట. ఇక ఇస్మార్ట్ శంకర్ లాంటీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రామ్ నుండి వస్తోన్న రెడ్ ఎప్పుడో విడుదలకావాల్సి ఉంది. ఈ సినిమా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 9న రిలీజ్ చేయాలి. కానీ మహమ్మారి కరోనా వైరస్‌ కారణంగా ఈ చిత్రం విడుదల వాయిదా పడింది. దీంతో ఈ సినిమాను డిజిటల్‌లో విడుదల చేయనున్నారనే వార్తలు అప్పట్లో హల్ చల్ చేశాయి. ఈ వార్తల్నీ రామ్ తన సోషల్ మీడియా వేదికగా ఖండించాడు. అంతేకాదు రెడ్ డైరెక్ట్‌గా థియేటర్‌లోని విడుదలకానుందని స్పష్టం చేశాడు. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత ఈ సినిమా విడుదల తేదిని చిత్రబృందం ప్రకటించనుంది.
First published: May 11, 2020, 2:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading