హోమ్ /వార్తలు /సినిమా /

రామ్ పోతినేని సినిమా 200 మిలియన్ నాటౌట్..

రామ్ పోతినేని సినిమా 200 మిలియన్ నాటౌట్..

రామ్ పోతినేని (ram pothineni)

రామ్ పోతినేని (ram pothineni)

Ram Pothineni: తెలుగు సినిమాలకు హిందీలో కూడా అదిరిపోయే క్రేజ్ ఉంది. ముఖ్యంగా సౌత్ సినిమాలు అంటే చాలు ఉత్తరాది ప్రేక్షకులు ఎగబడి చూస్తుంటారు. అందుకే డబ్బింగ్ వర్షన్స్‌కు చాలా రేట్..

తెలుగు సినిమాలకు హిందీలో కూడా అదిరిపోయే క్రేజ్ ఉంది. ముఖ్యంగా సౌత్ సినిమాలు అంటే చాలు ఉత్తరాది ప్రేక్షకులు ఎగబడి చూస్తుంటారు. అందుకే డబ్బింగ్ వర్షన్స్‌కు చాలా రేట్ కూడా వస్తుంటుంది. ఈ రోజుల్లో ఒక్కో సినిమాకు హిందీ డబ్బింగ్ రైట్స్ దాదాపు 10 కోట్లకు పైగానే వస్తున్నాయి. ఇప్పుడు ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన హలో గురు ప్రేమకోసమే సినిమా యూ ట్యూబ్‌లో సంచలనాలు సృష్టిస్తుంది. హిందీలో డబ్ అయిన ఈ చిత్రానికి అక్కడ అద్భుతమైన స్పందన వస్తుంది. రామ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా దర్శకుడు త్రినాథరావ్ నక్కిన తెరకెక్కించిన ఈ సినిమా పర్లేదనిపించింది. ప్రణీత ఇందులో మరో హీరోయిన్.

‘హలో గురూ ప్రేమకోసమే’ మూవీ ఫస్ట్ లుక్
‘హలో గురూ ప్రేమకోసమే’ మూవీ ఫస్ట్ లుక్

హిందీలో ఈ సినిమాను ధమ్‌దార్ కిలాడీ పేరుతో అనువాదం చేసారు. యూ ట్యూబ్‌లో ఈ సినిమాకు ఇప్పుడు 200 మిలియన్స్ వ్యూస్ అంటే 20 కోట్ల వ్యూస్ వచ్చాయి. రామ్ గత సినిమాలు కూడా అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇస్మార్ట్ శంకర్ హిందీ వర్షన్ కూడా కుమ్మేస్తుంది.

రామ్ పోతినేని (ram pothineni)
రామ్ పోతినేని (ram pothineni)

ప్రస్తుతం ఈయన కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ సినిమా చేస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఆగిపోయిన ఈ సినిమా థియేటర్స్ ఓపెన్ కాగానే విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. ఓటిటిలో విడుదలవుతుందనే వార్తలు వచ్చినా కూడా అందులో నిజం లేదని చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చింది.

First published:

Tags: Ram Pothineni, Telugu Cinema, Tollywood