టాలీవుడ్ యువ నటుడు రామ్ పోతినేని ఇటీవల రెడ్ సినిమాతో వచ్చి పరవాలేదనిపించాడు. సంక్రాంతికి విడుదలైన ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ సినిమా ఇచ్చిన ఫలితం తర్వాత ఆయన కొద్ది రోజులు వేచి ఉండి... ఓ తమిళ డైరెక్టర్‌తో సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. మాస్ డైరెక్టర్ లింగుసామితో ఓ సినిమాను ప్రకటించాడు రామ్. కాగా ఆయన మరో సినిమాను కూడా ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఇస్మార్ట్ తర్వాత రామ్ నటించిన రెడ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. వరుస ఫ్లాపులతో సతమతవుతున్న వేళా.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో రామ్ తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఊర మాస్ క్యారెక్టర్‌లో అదరగొట్టాడు. ఆ ఒక్క సినిమాతో రామ్ కెరీర్ ఎక్కడికో వెళ్లింది. ఆ సినిమా అటు పూరి జగన్నాథ్‌కు ఇటు రామ్‌కు కొత్త ఊపిరిని ఇచ్చింది. ఇక ఆ తర్వాత ఎన్నో అంచనాల నడుమ వచ్చిన రెడ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఆ సినిమాను స్రవంతి రవికిషోర్ స్రవంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించాడు. రెడ్ సినిమా తమిళ హిట్ చిత్రం తడమ్ కు తెలుగు రీమేక్‌గా వచ్చింది. రెడ్ సినిమా సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. రెడ్ సినిమా ఇచ్చిన అనుభవంతో రామ్ ఇప్పుడు కాస్తా ఆచితూచి సినిమాలను ఎంచుకుంటున్నాడు.
అందులో భాగంగా ఆయన పాపులర్ తమిళ డైరెక్టర్ ఎన్ లింగుసామితో రామ్ కొత్త సినిమా స్టార్ట్ చేయనున్నాడు. లింగుసామి విషయానికి వస్తే.. ఆయన గతంలో రన్, పందేంకోడి, ఆవారా వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తీశాడు. లింగుసామి మాస్ చిత్రాలకు మన తెలుగులో కూడా మంచి ఆదరణ లభించింది. దీనితో ఈ కాంబో నుంచి సినిమా ప్రకటన రావడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఒకేసారి తెలుగు, తమిళ భాషాల్లో ఏక కాలంలో బై లింగువల్ చిత్రంగా రూపోందనుంది. ఈ సినిమాను ఎస్ ఎస్ స్క్రీన్స్ బ్యానర్ లో శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్నాడు.
అది అలా ఉంటే రామ్ మరో సినిమాను కూడా ఓకే చేసినట్లు తెలుస్తోంది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ ఓ సినిమాలో నటించనున్నట్టు టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. అంతేకాదు బోయపాటి చెప్పిన కథ నచ్చడంతో రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. రామ్ ఎనర్జీకి తోడుగా బోయపాటి మాస్ కథ కూడా ఉండడంతో సినిమా ఓ రేంజ్’లో ఉంటుందని టాక్. ఈ సినిమాకు సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. బోయపాటి శ్రీను ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో 'గాడ్ ఫాదర్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే రామ్‌తో సినిమాను పట్టాలెక్కించనున్నాడట.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.