ఇస్మార్ట్ శంకర్ మళ్లీ వస్తున్నాడు.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే

తెలంగాణతో పాటు ఏపీలోని పలు థియేటర్లలో విడుదల చేస్తున్నామని వెల్లడించింది. ఈ వీకెండ్‌తో మరోసారి ఇస్మార్ట్ మూవీని ఎంజాయ్ చేయాలని అభిమానులకు విజ్ఞప్తి చేసింది ఛార్మి.

news18-telugu
Updated: September 26, 2019, 7:00 AM IST
ఇస్మార్ట్ శంకర్ మళ్లీ వస్తున్నాడు.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే
ఇస్మార్ట్ శంకర్ కలెక్షన్స్
  • Share this:
టాలీవుడ్‌లో 'ఇస్మార్ట్ శంకర్' సృష్టించిన అరాచకం అంతా ఇంతా కాదు. రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి కలెక్షన్‌ల మోత మోగించింది. సూపర్ డూపర్ సక్సెస్‌తో బాక్సాఫీస్‌‌ను షేక్ చేసింది. డబుల్ దిమాక్‌తో రామ్ పోతినేని యాక్టింగ్ ఇరగ దీశాడు. హైదరాబాదీ యాసలో చెప్పిన ఊర మాస్ డైలాగ్‌లకు అభిమానులు ఫిదా అయ్యారు. ఇక నభా నటేష్, నిధి అగర్వాల్ అందాల విందుకు థియేటర్లో పూనకంతో ఊగిపోయారు యూత్. దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాత ఛార్మిలో కొత్త ఉత్సాహం నింపిన ఇస్మార్ట్ మూవీ.. థియేటర్లలో మళ్లీ సందడి చేయబోతోంది.

ఇస్మార్ట్ శంకర్‌ మూవీని రీ-రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాత  ఛార్మి  ప్రకటించింది. సెప్టెంబరు 27 సినిమాను విడుదల చేస్తున్నామని సోషల్ మీడియా ద్వారా తెలిపింది. తెలంగాణతో పాటు ఏపీలోని పలు థియేటర్లలో విడుదల చేస్తున్నామని వెల్లడించింది. ఈ వీకెండ్‌తో మరోసారి ఇస్మార్ట్ మూవీని ఎంజాయ్ చేయాలని అభిమానులకు విజ్ఞప్తి చేసింది ఛార్మి.

తెలంగాణ థియేర్లు:

దిల్‌సుఖ్‌నగర్-వెంకటాద్రి


వరంగల్- లక్ష్మణ్
కరీంనగర్- తిరుమల
ఖమ్మం- ఆదిత్యకాజీపేట్-భవాని

ఏపీ థియేటర్లు:
రాజమండ్రి-ఊర్వశి
కాకినాడ- దేవి
తిరుపతి-విక్యాత్
గుంటూరు- స్వామి
వైజాగ్-గోకుల్

First published: September 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు