రామ్ చరణ్‌‌ను తొక్కేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ రామ్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ రామ్ తొక్కేసాడు. ఇంతకీ విషయం ఏమిటంటే..

news18-telugu
Updated: October 25, 2019, 5:51 PM IST
రామ్ చరణ్‌‌ను తొక్కేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ రామ్..
రామ్ చరణ్,రామ్
  • Share this:
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ రామ్ తొక్కేసాడు. ఇంతకీ విషయం ఏమిటంటే.. ఈ మధ్యకాలంలో సినిమాలు థియేటర్ రన్ ముగిసిన తర్వాత టీవీల్లో ప్రసారమవుతున్నాయి. అక్కడ కూడా పెద్ద హీరోల సినిమాలకు టీవీల్లో మంచి రేటింగ్సే వస్తున్నాయి. అందుకే పెద్ద పెద్ద టెలివిజన్ ఛానెల్స్ ఆయా హీరోల సినిమాల శాటిలైట్ రైట్స్‌ను పెద్ద రేటుకే కొనుక్కుంటున్నాయి. ఈ రకంగా కొనుకున్న సినిమాలను పండగల రోజున లేదా ఆదివారాలు ఏదైనా స్పెషల్ డే రోజున తమ సినిమాలను ప్రసారం చేస్తుంటారు. తాజగా ఒకేరోజు టెలివిజన్‌లో ప్రసారమైన ‘వినయ విదేయ రామ’, ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాల్లో రామ్ నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’.. ‘వినయ విధేయ రామ’ కంటే ఎక్కువ టీఆర్పీ సాధించింది.

ram ismart shankar movie record trp in television channels over ram charan vinaya vidheya rama movie,ram pothineni ismart shankar,ismart shankar,ram charan vinaya vidheya rama,ismart shankar vinaya vidheya rama,ismart shanakr record trp,vinaya vidheya rama low trp,ram charan twitter,ram charan instagram,ram pothineni twitter,ram pothineni instagram,ram pothineni facebook,ram charan facebook,ismart shankar vs vinaya vidheya rama,ram pothineni,ram pothineni movies,ram pothineni family,ram charan,ram pothineni age,ram charan new movie,ram pothineni education,ram pothineni biography,ram pothineni lifestyle,ram,ram charan movies in hindi dubbed full,ram pothineni wife,ram pothineni cars,ram pothineni new movie,ram pothineni hit movies,ram pothineni movies list,ram pothineni all movies list,ram movies,tollywood,telugu cinema,వినయ విధేయ రామ,ఇస్మార్ఠ్ శంకర్,ఇస్మార్ట్ శంకర్ వినయ విధేయ రామ,వినయ విదేయ రామ వర్సెస్ ఇస్మార్ట్ శంకర్,రామ్ వర్సెస్ రామ్ చరణ్,రామ్ చరన్‌ను తొక్కేసిన రామ్
రామ్ ఇస్మార్ట్ శంకర్,రామ్ చరణ్ వినయ విధేయ రామ్ (Twitter/Photo)


రెండు మాస్ సినిమాలే అయినా.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ ఊపు ముందు ‘వినయ విధేయ రామ’ నిలబడలేకపోయింది. రామ్ నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 14.44 టీఆర్పీ రాగా.. హైదరాబాద్‌లో మాత్రం 20.71 రికార్డు టీఆర్పీ సాధించింది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ‘వినయ విధేయ రామ’ సినిమాకు మాత్రం 7.85 టీర్పీ వచ్చినట్టు సమాచారం. ఒకేసారి టీవీల్లో ప్రసారమైన ‘వినయ విధేయ రామ’ కంటే ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకు డబుల్ టీఆర్పీ వచ్చింది. ఐతే.. ‘వినయ విధేయ రామ’ సినిమా కంటే ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకు ఎక్కువ రేటింగ్స్ రావడానికి కారణం రీసెంట్‌గా రిలీజైన సినిమా.  ప్రేక్షకులు కొత్తగా రిలీజైన ‘ఇస్మార్ట్ శంకర్’ పైనే ఫోకస్ పెట్టారు.మరోవైపు సంక్రాంతికి రిలీజైన ‘వినయ విధేయ రామ’ చిత్రాన్ని అంతకు ముందు డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్‌లో ప్రదర్శితమైంది. ఈ రకంగా ‘వినయ విధేయ రామ’ కంటే ఇస్మార్ట్ శంకర్‌కు ఎక్కువగా టీఆర్పీ రేటింగ్ వచ్చిందని సినీ వ్యూయర్స్ అభిప్రాయపడుతున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: October 25, 2019, 5:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading