మళ్లీ మొదలైన ‘ఇస్మార్ట్ శంకర్’ అరాచకం.. రామ్ నువ్వు మాములోడివి కాదు..

Ismart Shankar | పూరీ జగన్నాథ్, రామ్ కలయికలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయింది. పెట్టిన పెట్డుబడికి మూడింతల లాభాల్ని తీసుకొచ్చింది. తాజాగా ఈ చిత్రం బాలీవుడ్‌లో అరాచకం సృష్టిస్తోంది. అంతేకాదు..

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: February 17, 2020, 6:30 PM IST
మళ్లీ మొదలైన ‘ఇస్మార్ట్ శంకర్’ అరాచకం.. రామ్ నువ్వు మాములోడివి కాదు..
రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’ Instagram/ram_pothineni
  • Share this:
పూరీ జగన్నాథ్, రామ్ కలయికలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయింది. పెట్టిన పెట్డుబడికి మూడింతల లాభాల్ని తీసుకొచ్చింది. గతేడాది విడుదలై ఎక్కువ లాభాలను తీసుకొచ్చిన చిత్రాల్లో ‘ఇస్మార్ట్ శంకర్’ ముందు వరుసలో ఉంది. చాలా రోజుల తర్వాత మాస్ ఆడియన్స్‌ని ఈ చిత్రం డాన్సులు చేయించింది. చాలా రోజుల తర్వాత థియేటర్లలో విజిల్స్, గోలలు చేస్తూ ఎంజాయ్ చేసిన సినిమా ఇస్మార్ట్ శంకర్. రామ్ కెరీర్‌లో కూడా తొలిసారి రూ.40 కోట్ల షేర్‌ అందుకున్న సినిమా ఇది. ఎన్టీఆర్‌తో చేసిన టెంపర్ తర్వాత  సరైన సక్సెస్ లేని పూరీ జగన్నాథ్‌కు ఈ చిత్రం నిర్మాతగా, దర్శకుడిగా మంచి లాభాలని తీసుకొచ్చింది. ఇక రామ్ కూడా అంతే. చాలా ఏళ్ళ తర్వాత అసలైన బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమా టీవీలో ప్రసారం చేస్తే అదిరిపోయే టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి. అంతేకాదు ఈ సినిమాలో విడుదలైన ప్రతి పాట యూట్యూబ్‌లో అరాచకం సృష్టించాయి. తాజాగా ఈ చిత్రాన్ని హిందీలో డబ్ చేసి యూట్యూబ్‌లో విడుదల చేసారు. ఈ చిత్రం యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసి 24 గంటలు గడవక ముందే 11 మిలియన్ వ్యూస్ సంపాదించింది.అంటే కోటీ 10 లక్షల వ్యూస్ అన్నమాట. కేవలం ఒకరోజు వ్యవధిలో ఇన్ని వ్యూస్ సంపాదిస్తే.. ముందు ముందు యూట్యూబ్‌లో ఈ సినిమా ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి. మొత్తానికి రామ్ పోతినేని హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గరే కాదు.. యూట్యూబ్‌లో కూడా సంచలనాలకు వేదికగా నిలవబోతుంది. ఈ చిత్రంలో రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్‌గా నటించింది.

First published: February 17, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు