ప్రధాని మోదీ పిలుపుపై రామ్ గోపాల్ వర్మ వైరెటీ స్పందన.. అవాక్కవుతున్న నెటిజన్స్..

ప్రస్తుతం మన దేశంతో పాటు ప్రపంచం మొత్తం కరోనాపై పోరాడుతోంది. ఈ మహామ్మారిని దేశం నుండి పారద్రోలడానికి కేంద్రం తన వంతు చర్యలను ముమ్మురం చేసింది. తాజాగా ప్రధాని పిలుపు మేరకు రామ్ గోపాల్ వర్మ ఎలా స్పందించాడంటే..

news18-telugu
Updated: April 6, 2020, 2:51 PM IST
ప్రధాని మోదీ పిలుపుపై రామ్ గోపాల్ వర్మ వైరెటీ స్పందన.. అవాక్కవుతున్న నెటిజన్స్..
రాంగోపాల్ వర్మ
  • Share this:
ప్రస్తుతం మన దేశంతో పాటు ప్రపంచం మొత్తం కరోనాపై పోరాడుతోంది. ఈ మహామ్మారిని దేశం నుండి పారద్రోలడానికి కేంద్రం తన వంతు చర్యలను ముమ్మురం చేసింది. ఈ వైరస్ నివారణ కోసం దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 21 రోజుల పాటు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే కరోనాపై పోరాటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు తమవంతు సాయం చేయడంలో నిమగ్నమయ్యాయి. మరోవైపు ప్రధాని పిలుపు మేరకు ఇప్పటికే దేశ ప్రజలు చప్పట్లతో  మొదటిసారి సంఘీభావం తెలిపారు. నిన్న ఆదివారం రాత్రి 9 గంటల 9 నిమిషాలకు దేశ ప్రజలు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు   దీపాలు వెలిగించి కరోనా పై పోరులో దేశ ప్రజలంతా ఒక్కటే అని నిరూపించారు. ఈ మహా యజ్ఞంలో పేదా, గొప్ప తేడా లేకుండా అందరు దీపాలు వెలిగించి దేశం విపత్కర పరిస్థితుల్లో మేమంతా ఒకటే అని పిలుపునిచ్చాయి. దీనిని సినీ, వాణిజ్య, రాజకీయ, క్రీడా ప్రముఖులు కూడా దీపాలు వెలిగించి తమ ఐక్యతను చాటారు. ఇక ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. మాత్రం వెరైటీగా స్పందించారు. ఐతే.. ఊరందరి  ఓ దారైతే.. తన రూటే సపరేటు అనేలా రామ్ గోపాల్ వర్మ ప్రవర్తించాడు. అందరూ ఇంట్లో దీపాలు వెలిగిస్తూ.. క్యాండిల్స్  వెలిగిస్తూ. టార్చిలైట్స్ ద్వారా తమ సంఘీభావం ప్రకటించారు. ఆ ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు. అయితే రామ్ గోపాల్ వర్మ మాత్రం లైటర్ ద్వారా సిగరెట్‌ను వెలిగించుకున్న వీడియోను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.

Ram gopal varma variety response on pm modi calls to nation,ram gopal varma, ram gopal varma setirical tweet,ram gopal varma variety responce on pm modi,ram gopal varma pm narendra modi,ram gopal varma,ram gopal varma tweet on humans,ram gopal varma setirical tweet on humans are big disease our planetram gopal new body guards,ram gopal varma new body guards dogs,ram gopal varma dog body guards,ram gopal varma tweet,rgv salman khan,ram gopal varma twitter,ram gopal varma instagram,ram gopal varma facebook,ram gopal varma on police reaction,rgv,varma,tollywood,telugu cinema,రామ్ గోపాల్ వర్మ,రామ్ గోపాల్ వర్మ ట్వీట్,రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్,రామ్ గోపాల్ వర్మ ఇన్‌స్టాగ్రామ్,రామ్ గోపాల్ వర్మ పోలీసులు,రామ్ గోపాల్ వర్మ సల్మాన్ ఖాన్, రామ్ గోపాల్ వర్మ కొత్త బాడీ గార్ట్స్,భూ గ్రహంపై అతిపెద్ద వైరస్ మనుషులు,రామ్ గోపాల్ వర్మ ప్రధాన మంత్రి,ప్రధాన మంత్రి పిలుపుపై రామ్ గోపాల్ వర్మ వెరైటీగా స్పందన
ప్రధాని మోదీ పిలుపుపై లైటర్‌తో సిగరెట్ వెలిగించిన వర్మ (Twitter/Photo)


మొత్తానికి దేశం మొత్తం కరోనా పై పోరాటంలో తమ వంతు బాధ్యతను నిర్వహిస్తే.. రామ్ గోపాల్ వర్మ ఇలా వెటకారంగా ప్రవర్తించడానికి చాలా మంది నెటిజన్స్ తప్పు పడుతున్నారు.


First published: April 6, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading