మహేష్ బాబు కంటే కులపిచ్చే ఎక్కువ.. రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు

HBD Mahesh Babu | దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈసారి సూపర్ స్టార్ మహేష్ బాబును టార్గెట్ చేశాడు.

news18-telugu
Updated: August 9, 2019, 5:01 PM IST
మహేష్ బాబు కంటే కులపిచ్చే ఎక్కువ.. రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు
మహేష్ బాబు (Photo : Twitter)
  • Share this:
వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే రామ్ గోపాల్ వర్మ మరోసారి ట్విట్టర్‌లో బాంబు పేల్చారు. బర్త్‌డే బాయ్ మహేష్ బాబును టార్గెట్ చేశారు. ఈ రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు. దీంతో మహేష్ బాబు కొత్త సినిమా సరిలేరు నీకెవ్వరు మూవీలో నుంచి హీరో ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. మరోవైపు రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా కమ్మ రాజ్యంలో కడపరెడ్లు సినిమాకు సంబంధించిన ఓ పాటను కూడా రిలీజ్ చేశారు. మహేష్ బాబు ఇంట్రో, ఆర్జీవీ పాట ఒకేసమయంలో యూట్యూబ్‌లో రిలీజ్ అయినా, తన కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా పాటే ఎక్కువ పాపులర్ అయిందంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు పాట ట్రెండింగ్ నెంబర్ 2లో ఉంది. మహేష్ పుట్టినరోజు అయినా కూడా అతడి ఇంట్రో ట్రెండింగ్‌లోనే లేదు. రెండూ ఒకటేసారి.. రిలీజ్ అయినా కూడా జనం సూపర్ స్టార్స్ కంటే కులాభిమానం మీదే ఎక్కువ ఇంటస్ట్ర్ చూపించారు. దటీజ్ వెరీ బ్యాడ్’ అని ట్వీట్ చేశాడు.First published: August 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు