RAM GOPAL VARMA TWEETS ON CHIRANJEEVI CM JAGAN MEETING MK
సీఎం జగన్తో చిరంజీవి భేటీపై రాంగోపాల్ వర్మ సంచలన ట్వీట్...
సీఎం జగన్తో చిరంజీవి భేటీ (File)
విజయవాడలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి భేటీని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ లో ఆయన 151తో 151 భేటీ అయ్యాడు అంటూ వావ్ అంటూ ఓ ఎక్స్ ప్రెషన్ పెట్టాడు.
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి తన ట్వీట్ల బాణాలను ఎక్కుపెట్టాడు. ఈ సారి ఆయన మెగాస్టార్ చిరంజీవిపై తన ట్వీట్లను వదిలాడు. విజయవాడలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి భేటీని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ లో ఆయన 151తో 151 భేటీ అయ్యాడు అంటూ వావ్ అంటూ ఓ ఎక్స్ ప్రెషన్ పెట్టాడు. అయితే 151 అంటే చిరంజీవి సైరా చిత్రమని, మరో 151 అంటే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలుచుకున్న ఎమ్మెల్యే స్థానాలతో పోల్చుతూ చమత్కరించాడు. ఇదిలా ఉంటే గత కొన్ని సంవత్సరాలుగా రాంగోపాల్ వర్మ మెగాఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నాడు. అంతే కాదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సైతం ఆర్జీవీ ఇలాంటి ట్వీట్లనే వదిలేవాడు. రాంగోపాల్ వర్మ ట్వీట్లపై గతంలో మెగా బ్రదర్ నాగబాబు సైతం బహిరంగ సభలోనే హెచ్చరించాడు. అయినా డోంట్ కేర్ అన్న రేంజ్ లో ఆర్జీవీ ట్వీట్లతో రెచ్చిపోయేవాడు. అయితే తాజాగా చేసిన ట్వీట్ లో పెద్దగా దుమారం లేకపోయినప్పటికీ, ముందు ముందు మెగాస్టార్ ను కార్నర్ చేస్తూ ఎలాంటి ట్వీట్లను ఆర్జీవీ సిద్ధం చేస్తాడో అని చిరు అభిమానులు గుర్రుగా ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.