బంధు ప్రీతి లేనిది ఎక్కడ.. సుశాంత్ ఆత్మహత్యపై వర్మ మార్క్ ట్వీట్..

బాలీవుడ్ వర్ధమాన నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య సినీ ఇండస్ట్రీని నిర్ఘాంతపోయేలా చేసింది. తాజాగా సుశాంత్ మరణంపై వర్మ తనదైన శైలిలో ట్వీట్ చేసాడు.

news18-telugu
Updated: June 17, 2020, 8:51 AM IST
బంధు ప్రీతి లేనిది ఎక్కడ.. సుశాంత్ ఆత్మహత్యపై వర్మ మార్క్ ట్వీట్..
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Twitter/Photo)
  • Share this:
బాలీవుడ్ వర్ధమాన నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య సినీ ఇండస్ట్రీని నిర్ఘాంతపోయేలా చేసింది. ఈ మృతికి బాలీవుడ్‌లో ఉన్న బంధుప్రీతి కారణమంటూ నెటిజన్లు కరణ్ జోహార్, ఆలియా భట్‌లను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అంతేకాదు వీళ్ల సినిమాలను చూడొద్దంటూ పిలుపునిస్తున్నారు. ముఖ్యంగా కరణ్ జోహార్ చుట్టూ ఉన్న కోటరీయే సుశాంత్‌‌కు వేరే బ్యానర్‌లో ఆయనకు అవకాశాలు లేకుండా చేసారని .. అందువల్లే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్టు నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. అంతేకాదు కాఫీ విత్ కరణ్ ప్రోగ్రామ్‌లో కరణ్ జోహార్, ఆలియాతో కలిసి సుశాంత్‌‌ను అవమానించేలా మాట్లాడిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఐతే.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని రామ్ గోపాల్ వర్మ కొట్టిపారేసారు. అసలు సినిమా ఇండస్ట్రీతో పాటు అన్ని ఇండస్ట్రీల్లో బంధుప్రీతి పాతుకుపోయిందన్నారు. అది లేనిది ఎక్కడ అంటూ ప్రశ్నించాడు.


సుశాంత్ ఆత్మహత్య విషయంలో కరణ్ జోహార్‌ను నిందించడం చూస్తుంటే నాకు నవ్వొస్తోంది. సినీ పరిశ్రమ ఎలా ఉంటుందో తెలియక కరణ్‌ను విమర్శిస్తున్నారని తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. నటుడైన సుశాంత్‌తో కష్టం అనుకున్నపుడు అతనితో సినిమా చేయాలా వద్దా అనేది ఆ సినిమాను నిర్మించే నిర్మాతల ఇష్టంపై ఆధారపడి ఉంటుందన్నారు. ఇందులో కరణ్‌‌ను తప్పుపట్టాల్సిన పనిలేదు. ఇండస్ట్రీకి వచ్చి 12 యేళ్లు అవుతున్న నేను ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కాననే ఫీలింగ్‌తో సుశాంత్ ఆత్మహత్య చేసుకుంటే.. ఈ స్థాయి ప్రయత్నాలు చేస్తోన్నవారు రోజుకు కనీసం 100 మంది ఆత్మహత్య చేసుకోవాలన్నారు. ఉన్నదానితో సంతృప్తి లేనపుడు ఎంత ఉన్న ప్రయోజనం ఏముంటుందన్నారు ? ములాయం, ఉద్దవ్, వంటి వారు తమ వారసత్వానికి ప్రాధాన్యత ఇచ్చినట్టు ప్రతి చోట తమకు కావాల్సిన వారికే ప్రాధాన్యత ఇస్తారు. రాజకీయలు, వ్యాపారంతో పాటు సినీ ఇండస్ట్రీ కూడా వారసత్వంతో నిండిపోయిందన్నారు. మరోవైపు అమితాబ్ బచ్చన్, షారుఖ్, అక్షయ్ లాంటి వాళ్లు ఒకపుడు  ఇండస్ట్రీ బయటి వ్యక్తులే  వర్మ తన ట్వీట్‌లో పేర్కొనడం విశేషం.
Published by: Kiran Kumar Thanjavur
First published: June 17, 2020, 8:49 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading