
రామ్ గోపాల్ వర్మ త్రిపుల్ రైడింగ్ (ట్విట్టర్ ఫోటో)
రామ్ గోపాల్ వర్మ ఎపుడు ఎవ్వరినీ ఎలా కెలుకుతాడో ఎవ్వరికీ తెలియదు. ఒక్కసారి వర్మ టార్గెట్ చేసాడంటే అవతలివాళ్లు చిత్తు కావాల్సిందే. తాజాగా రామ్ గోపాల్ వర్మ హైదరాబాద్ సిటీ పోలీసులకు ‘ఇస్మార్ట్ శంకర్’ సాక్షిగా సవాల్ విసిరాడు.
రామ్ గోపాల్ వర్మ ఎపుడు ఎవ్వరినీ ఎలా కెలుకుతాడో ఎవ్వరికీ తెలియదు. ఒక్కసారి వర్మ టార్గెట్ చేసాడంటే అవతలివాళ్లు చిత్తు కావాల్సిందే. తాజాగా రామ్ గోపాల్ వర్మ హైదరాబాద్ సిటీ పోలీసులకు ‘ఇస్మార్ట్ శంకర్’ సాక్షిగా సవాల్ విసిరాడు. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ ..తన శిష్యులైన మరో ఇద్దరు డైరెక్టర్లు..ఆర్.ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి, ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను వర్మతో డైరెక్ట్ చేసిన అగస్త్య మంజుతో కలిసి బుల్లెట్ బండిపై హెల్మెట్ లేకుండా త్రిపుల్ రైడ్‌తో హైదరాబాద్,మూసాపేటలోని శ్రీరాములు థియేటర్‌కి ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాను వెళ్లాడు. ఈ సందర్భంగా తాను త్రిపుల్ రైడింగ్‌తో సినిమా థియేటర్‌కు వచ్చిన ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేసాడు. ఇపుడీ ఫోటో సోషల్ మీడియలో వైరల్ అవుతుంది. గతంలో ఇదే ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా షూటింగ్ సందర్భంగా చార్మినార్ దగ్గర రామ్ సిగరెట్ స్మోక్ చేసాడు. ఆ తర్వాత చార్మినార్ పోలీసులు రామ్‌కు జరిమానా విధించారు. ఇపుడు రామ్ గోపాల్ వర్మ తన ఇద్దరు శిష్యులైన డైరెక్టర్లతో అది హెల్మెట్ లేకుండా థియేటర్‌కు రావడం చూస్తుంటే.. ఆయన ప్రజలకు ఏమి సందేశం ఇస్తున్నట్టు అని నెటిజన్స్ చర్చించుకుంటారు. మరి వర్మ చేసిన ఈ పనికి పోలీసులు ఏ రకంగా స్పందిస్తారనేది చూడాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:July 20, 2019, 16:06 IST