Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: May 19, 2020, 9:13 PM IST
నాథూరాం గాడ్సేపై నాగబాబు వ్యాఖ్యలకు వర్మ సపోర్ట్ (nathuram godse naga babu)
నాగబాబు పుణ్యమా అని నాథూరాం గాడ్సే పేరు మళ్లీ చాలా రోజుల తర్వాత వినిపిస్తుంది. మహాత్మ గాంధీని చంపిన హంతకుడిగానే నాథూరాం గాడ్సే అందరికీ పరిచయం. కానీ ఈయనే నిజమైన దేశ భక్తుడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు నాగబాబు. అప్పట్లో మీడియా ఒకవైపు చూపించిందని.. ఇఫ్పటికీ అదే పని చేస్తున్నారంటూ సెటైర్లు కూడా వేసాడు. గాడ్సే సిద్ధాంతాల గురించి సరిగ్గా చూపించి ఉంటే ఆయన కూడా నిజమైన దేశభక్తుడే అంటూ నాగబాబు చేసిన వివాదస్పద వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయిప్పుడు. దీనికి సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సమర్ధించాడు.

నాథూరాం గాడ్సేపై నాగబాబు వ్యాఖ్యలకు వర్మ సపోర్ట్ (nathuram godse naga babu)
ఆయన చెప్పింది నూటికి నూరు శాతం నిజమే అంటూ వంత పాడాడు వర్మ. ఓ ఛానెల్ డిబేట్లో మాట్లాడుతూ.. వర్మ ఈ వ్యఖ్యలు చేసాడు. గాడ్సే కోరుకున్నవి రెండూ నెరవేరినా గాంధీని ఎందుకు చంపాడనేది ఎవరికీ తెలియదని చెప్పాడు వర్మ.

నాథూరాం గాడ్సేపై నాగబాబు వ్యాఖ్యలకు వర్మ సపోర్ట్ (nathuram godse naga babu)
అంతేకాదు.. తన జీవితంలో ఎప్పుడూ తుపాకి పట్టని గాడ్సే.. గాంధీని చంపడానికి పట్టుకున్నాడని చెప్పాడు. ఆయనపై ఒక్క క్రిమినల్ కేసు కూడా లేదని గుర్తు చేసాడు ఈ దర్శకుడు. త్వరలోనే గాడ్సేపై ఓ సినిమా చేస్తానని చెప్పాడు రామ్ గోపాల్ వర్మ. ఇక దేవుడున్నాడని గుర్తు చేయడానికి.. అతన్ని మర్చిపోకుండా ఉండటానికే కరోనాను పంపించాడని ఆయన సెటైర్లు వేసాడు.
Published by:
Praveen Kumar Vadla
First published:
May 19, 2020, 9:13 PM IST