రాజమౌళికి అదిరిపోయే సలహా ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ..

దర్శక ధీరుడు రాజమౌళికి ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అద్భుతమైన సలహా ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: July 20, 2020, 1:32 PM IST
రాజమౌళికి అదిరిపోయే సలహా ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ..
రాజమౌళికి ఆర్జీవి సలహా (Twitter/Photo)
  • Share this:
దర్శక ధీరుడు రాజమౌళికి ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అద్భుతమైన సలహా ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం ఆర్జీవి.. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ‘క్లైమాక్స్. సినిమాతో పాటు ‘నగ్నం’ సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన ఈ దర్శకుడు ఇపుడు ’థ్రిల్లర్’  మూవీతో పాటు ’పవర్ స్టార్’ అనే పొలిటికల్ సెటైర్ మూవీ చేస్తున్నాడు. ఎన్నికల తర్వాత కథ అంటూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమా ట్రైలర్ చూడాలంటే డబ్బులు కట్టాలంటూ చెప్పి ఇంత వరకు ఎవరు చేయని పని చేసి చూపించాడు. ఈ నెల 22న సినిమా ట్రైలర్ విడుదల కానుంది. మరోవైపు ఆర్జీవి పవర్ స్టార్ సినిమా నుంచి పూటకో అప్‌డేట్ ఇస్తున్నాడు. తాజాగా రామ్ గోపాల్ వర్మ.. దర్శకధీరుడు రాజమౌళికి అద్భుతమైన సలహా ఇచ్చాడు. ప్రస్తుతం జక్కన్న ‘బాహుబలి’ తర్వాత ఎన్టీఆర్ ,రామ్ చరణ్ వంటి హీరోలతో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు రామ్ చరణ్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ప్రస్తుతం ’ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల్లో అమితాసక్తి ఉంది. ఈ సినిమా ట్రైలర్‌ చూసేందకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  ఒకవేళ రాజమౌళి ఈ సినిమా ట్రైలర్ చూసేందుకు  డబ్బులు పెడితే.. ప్రేక్షకులు కూడా డబ్బులు చెల్లించి ఈ సినిమా ట్రైలర్ చూసేందుకు ఆసక్తిగా ఉన్నారని వర్మ చెప్పుకొచ్చాడు. ఆ రకంగా నిర్మాతకు డబ్బులు కూడా వస్తాయని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ప్రపంచ మొత్తం ఆన్‌లైన్ వైపు దృష్టి సారించింది. రాజమౌళి కూడా కొత్త ఆలోచనతో ముందుకు రావాలన్నారు. ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌ చూసేందకు డబ్బులు చెల్లించి చూసేందుకు నాలాంటి వాళ్లు  రెడీగా ఉన్నారంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసాడు. మరి వర్మ సూచనలను రాజమౌళి ఏ మేరకు పట్టించుకుంటాడనేది చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: July 20, 2020, 1:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading