
పవన్ ‘వకీల్ సాబ్’కు పోటీగా వర్మ ‘డైరెక్టర్ సాబ్’ (Facebook/Photo)
ఎపుడు ఎవరినీ ఎలా గిల్లాలో రామ్ గోపాల్ వర్మకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. తాజాగా వర్మ.. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్‌కు పోటీగా.. డైరెక్టర్ సాబ్ అంటూ ఒక పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.
ఎపుడు ఎవరినీ ఎలా గిల్లాలో రామ్ గోపాల్ వర్మకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. తాజాగా ఈయన పవన్ కళ్యాణ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. తాజాగా విడుదలైన ఈ మూవీ లుక్‌పై అభిమానులతో పాటు సినీ వర్గాలు పాజిటివ్‌గా రెస్పాండ్ అవుతున్నారు. తాజాగా రామ్ గోపాల్ వర్మ.. వపన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ లుక్‌పై తనదైన శైలిలో సెటైర్లు వేసాడు. వకీల్ సాబ్‌గా పవన్ కళ్యాణ్ ఒక చెయిర్లో కూర్చొని కాలుపై మరో కాలు వేసుకొని కేసు స్డడీ చేస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ లుక్ ఉంది. పవర్ స్టార్ లుక్‌లో ఉన్నట్టే రామ్ గోపాల్ వర్మ.. కాలు పై కాలు వేసుకొని కుర్చీ పై కూర్చొని కాస్తంత వ్యంగ్యంగా ‘డైరెక్టర్ సాబ్’ అంటూ ఒక పోస్టర్‌ను రిలీజ్ చేసాడు.
రామ్ గోపాల్ వర్మ.. పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేయడం ఇది మొదటిసారి కాదు. ఎన్నో సార్లు టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు ఎంతో మంది హీరోలను రామ్ గోపాల్ వర్మ..తన ట్వీట్లతో ఇబ్బందులు పెట్టాడు. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ .. దిశ అత్యాచార ఘటనపై ‘దిశ’ పేరుతో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ విషయానికొస్తే.. ‘వకీల్ సాబ్’ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో ‘విరూపాక్షి’ అనే పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ సినిమా చేస్తున్నాడు. దాంతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో మూవీని అఫీషియల్‌గా ప్రకటించాడు. ఈ మూడు సినిమాల తర్వాత కిషోర్ పార్థసాని (డాలీ). కే.యస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
Published by:Kiran Kumar Thanjavur
First published:March 02, 2020, 20:00 IST