Home /News /movies /

RAM GOPAL VARMA SHARED APSARA RANI BIKINI PHOTO IN HIS INSTAGRAM SLB

RGV: హీరోయిన్ అర్ధనగ్న ఫొటో.. ఏకంగా ఆ ప్రశ్న! వామ్మో.. రామ్ గోపాల్ వర్మ మామూలోడు కాదండోయ్

Ram Gopal Varma/ Photo Twitter

Ram Gopal Varma/ Photo Twitter

Apsara Rani: హీరోయిన్ల విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటూ ఉంటారు రామ్ గోపాల్ వర్మ. తన సినిమాల్లో నటించిన హీరోయిన్లను ప్రమోట్ చేస్తూ జనం వారి పేర్లు నోళ్ళలో నానేలా చేయడంలో ముందుంటారు రామ్ గోపాల్ వర్మ.

వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండటం, ఏ విషయమైనా సరే తనదైన కోణంలోనే ఆలోచించడం రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) నైజం. ఎవరేమనుకుంటే నాకేంటి అనే ధోరణితో ముందుకెళ్తుంటారు ఆర్జీవీ. అందుకే ఎప్పుడు చూసినా సామజిక మాధ్యమాల్లో, వార్తా పత్రికల్లో రామ్ గోపాల్ వర్మ పేరు నానుతూనే ఉంటుంది. ఇక హీరోయిన్ల విషయంలో అయితే స్పెషల్ కేర్ తీసుకుంటూ ఉంటారు రామ్ గోపాల్ వర్మ. తన సినిమాల్లో నటించిన హీరోయిన్లను ప్రమోట్ చేస్తూ జనం వారి పేర్లు నోళ్ళలో నానేలా చేయడంలో ముందుంటారు రామ్ గోపాల్ వర్మ. ఈ క్రమంలోనే తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ హీరోయిన్ అర్ధనగ్న ఫొటో షేర్ చేసి ఆన్ లైన్ రచ్చకు తెరలేపారు వర్మ.

అటు హీరోయిన్లకు పాపులారిటీ తీసుకొస్తూ తన సినిమాను కూడా ప్రమోట్ చేసుకోవడం ఒక్క వర్మకే చెల్లుతుంది. బోల్డ్‌గా మాట్లాడుతూ హీరోయిన్లను ఫేమస్ చేసేస్తుంటాడు ఆర్జీవీ. అలా ఇప్పటికే ఎంతోమంది సుందరాంగులను ప్రేక్షకులకు పరిచయం చేశారు వర్మ. అలా పరిచయం చేసిన వారిలో అప్సర రాణి (Apsara Rani) తెగ పాపులర్ అయింది. ఆర్జీవీ స్టార్ట్ ఇస్తే.. అప్సర దూసుకుపోయింది. వర్మతో పార్టీలు చేసుకుంటూ ఆయా ఫొటోస్ సోషల్ మీడియాలో పెట్టడం, అలాగే తన హాట్ లుక్స్‌తో ఆన్ లైన్ మాధ్యమాలను వేడెక్కించడం లాంటి ట్రిక్స్ ప్లే చేస్తూ జనం నోళ్ళలో నానిపోతోంది అప్సర రాణి.

ఈ నేపథ్యంలో అప్సర రాణి అర్ధనగ్న ఫొటో (Apsara Rani Semi Nude Photo) ఒకటి షేర్ చేస్తూ.. ఆమెలో ఏ పార్ట్ అందంగా లేదో చెప్పగలరా? అనే ప్రశ్న వేశారు రామ్ గోపాల్ వర్మ. దీంతో ఆన్ లైన్ మాద్యమాలపై రచ్చ షురూ అయింది. ఎవరికీ తోచినవిధంగా వాళ్ళు కామెంట్స్ పెడుతూ రచ్చ రచ్చ చేస్తున్నారు నెటిజన్లు. కొందరైతే.. ఇదేందయ్యా వర్మ? అంటూ ఆర్జీవీని టార్గెట్ చేస్తూ కామెంట్లు వదులుతున్నారు. దీంతో ఈ పిక్ నెట్టింట వైరల్ గా మారింది.








View this post on Instagram






A post shared by RGV (@rgvzoomin)






సినిమాల పరంగా డిఫరెంట్ వే లో వెళ్తున్నారు వర్మ. ఇటీవల రాజకీయ నేపథ్యంలో కొండా (Konda) మూవీ విడుదల చేశారు. కొండా సురేఖ, మురళి బయోపిక్ గా ఈ సినిమా రూపొందింది. అలాగే ఆర్జీవీ రూపొందించిన లడ్కి మూవీ జులై 15న విడుదల కానుంది. ఈ చిత్రంలో పూజా భలేకర్ ప్రధాన పాత్రలో నటించింది. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఇండో చైనీస్ మూవీగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
Published by:Sunil Boddula
First published:

Tags: Apsara Rani, Ram Gopal Varma, RGV

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు