Home /News /movies /

RAM GOPAL VARMA SETIRES ON PRAJA SHANTI PARTY LEADER KA PAUL TA

కేఏ పాల్‌పై వర్మ మార్క్ సెటైర్లు.. ఏమన్నాడంటే..

రామ్ గోపాల్ వర్మ, కేఏ పాల్ (Facebook/Photo)

రామ్ గోపాల్ వర్మ, కేఏ పాల్ (Facebook/Photo)

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ టైటిల్‌తోనే వివాదాల్లో నిలిచింది. తాజాగా ఈ సినిమాలో కేఏ పాల్ పాత్ర గురంచి ఆర్జీవి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

    వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ టైటిల్‌తోనే వివాదాల్లో నిలిచింది. ఈ సినిమా పేరు ఒక కులం వాళ్లను కించ పరిచేలా ,..మరో  కులాన్ని నెత్తిన ఎత్తుకునేలా  ఉందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాదు.. ఈ సినిమాలో ఏపీలోని పలు ప్రాంతీయ పార్టీల అధినేతలను తక్కువ చేసేలా ఉందన్నారు. తాజాగా ఈ సినిమా విడుదలను నిలుపుదల చేయాలని ప్రముఖ క్రైస్తవ మత బోధకుడు.. ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే కదా. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఈ సినిమాను రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించాడని  కేఏ పాల్ ఆరోపించారు. అంతేకాదు ఈ నెల 29న విడుదల కానున్న ఈ సినిమాను నిలుపుదల చేయాలని  తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక రామ్ గోపాల్ వర్మ.. ఈ సినిమా టైటిల్‌ను కాస్తా ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ అనే టైటిల్‌గా మార్చిన సంగతి తెలిసిందే కదా.



    ka paul filed a petition on kamma rajyam lo kadapa reddlu movie in high court,ka paul,ram gopal varma,ka paul rgv ram gopal varma,ka paul filed case in high court,kamma rajyamlo kadapa redlu,kamma rajyamlo kadapa redlu title changed,kamma rajyamlo kadapa redlu title change as makka rajyamlo dakapa reddlu,kamma rajyamlo kadapa redlu release date,kamma rajyamlo kadapa redlu latest,ramgopal varma,రాంగోపాల్ వర్మ,కమ్మ రాజ్యంలో కడప రెడ్లు,కమ్మ రాజ్యంలో కడప రెడ్లు రిలీజ్ డేట్,కమ్మరాజ్యంలో కడప రెడ్లు లేటెస్ట్,కమ్మ రాజ్యంల కడప రెడ్లు,మక్క రాజ్యంలో డపక రెడ్లు,కేఏ పాల్,హైకోర్టు,కమ్మరాజ్యంలో కడపరెడ్లు మూవీపై హైకోర్టులో పిటిషన్,కేఏ పాల్ రామ్ గోపాల్ వర్మ
    ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సినిమా పై హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్



    తాజాగా ఈ సినిమాలో కేఏ పాల్ పాత్ర గురంచి ఆర్జీవి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నేను కేఏ పాల్‌ను పట్టించుకోవడం మానేసి చాలా కాలమైందన్నారు. ఆయన ప్రపంచ యుద్ధం ఆపే పనిలో బిజీగా ఉన్నారని చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో ఆయన పాత్ర విషయాన్ని ఆయన అంతగా సీరియస్‌గా తీసుకుంటారని నేను భావించడం లేదన్నారు. తాజాగా ఈ సినిమా విడుదల విషయమై హైకోర్డు మరికాసేట్టో తీర్పు ఇవ్వనుంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Ka paul, KAMMA RAJYAMLO KADAPA REDDLU, Praja shanti party, Ram Gopal Varma, Telugu Cinema, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు