ఇన్ డైరెక్ట్‌గా రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్‌లపై ఆర్జీవి సెటైర్లు..

రామ్ గోపాల్ వర్మ ఎపుడు ఎవరిపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో చెప్పడం కాస్త కష్టమే. తన మనసుల ఏముందో నిర్మొహమాటంగా చెప్పడం వర్మను చూసే నేర్చకోవాలి.

news18-telugu
Updated: May 29, 2020, 9:34 AM IST
ఇన్ డైరెక్ట్‌గా రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్‌లపై ఆర్జీవి సెటైర్లు..
రామ్ గోపాల్ వర్మ (RGV)
  • Share this:
రామ్ గోపాల్ వర్మ ఎపుడు ఎవరిపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో చెప్పడం కాస్త కష్టమే. తన మనసుల ఏముందో నిర్మొహమాటంగా చెప్పడం వర్మను చూసే నేర్చకోవాలి. తాజాగా ఆయన లాక్‌డౌన్ సమయంలో ఇళ్లకే పరిమితమైన హీరోలు, దర్శకులపై రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో సెటెర్లు వేసాడు. అందరు కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైతే.. రామ్ గోపాల్ వర్మ మాత్రం కరోనా వంటి  క్లిష్ట సమయంలో కూడా ‘క్లైమాక్స్’, సినిమాతో పాటు ‘కరోనా’ పేరుతో మరో సినిమాను తెరకెక్కించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తాజాగా క్లైమాక్స్ ట్రైలర్‌ను విడుదల చేసాడు. ఈ సినిమా ట్రైలర్‌ను  చూసి  అమితాబ్ బచ్చన్ కూడా మెచ్చుకున్నారు.ఈ సందర్భంగా ఓ నెటిజన్ రామ్ గోపాల్ వర్మను ఉద్దేశిస్తూ .. మీరు ఇంట్లో ఉండి ఏ పనులు చేయరు. గిన్నెలు తోమరు. బట్టలు ఉతకరు. అలాంటి మీ కోసం మేము ట్వీట్లు కూడా చేయమంటూ వ్యాఖ్యానించాడు. దీనికి వర్మ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. లాక్‌డౌన్ సమయంలో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి హీరోలు ఇంట్లో ‘బీ ది రియల్ మేన్’ ఛాలెంజ్‌లో భాగంగా ఇంట్లో పనులు చేసిన సంగతిని ఇన్ డైరెక్ట్‌గా ప్రస్తావిస్తూ.. వాళ్లంత ఇంట్లో పనులతో బిజీగా ఉంటే.. నేను మాత్రం తాను మాత్రం ఏకంగా రెండు సినిమాలు తెరకెక్కించానంటూ చెప్పుకొచ్చాడు. మొత్తానికి రామ్ గోపాల్ వర్మ కరోనా లాక్‌డౌన్‌ను విడవకుండా తన పని తాను అనుకున్నది చేసాడు. ఏమైనా వర్మ ప్రభుత్వ ఉత్తర్వులను పట్టించుకోకుండా షూటింగ్ ఎలా చేసాడా అని అందరు చెవులు కొరుక్కుంటున్నారు. మరి గవర్నమెంట్.. వర్మపై ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
First published: May 29, 2020, 9:13 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading