RAM GOPAL VARMA SENSATIONAL REVIEW ON RRR AND RELEASED A VOICE NOTE GOING VIRAL IN SOCIAL MEDIA PK
RGV Review on RRR movie: 'RRR' సినిమాకు సెన్సేషనల్ రివ్యూ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ..
రామ్ గోపాల్ వర్మ ట్రిపుల్ ఆర్ రివ్యూ (rgv rrr movie)
RGV Review on RRR movie: సాధారణంగా ప్రతి విషయంపై విమర్శలు చేయడం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV Review on RRR movie) కు అలవాటు. ఆయన ఏం మాట్లాడినా కూడా నెగిటివ్ సెన్స్లోనే ఉంటుందని చాలా మంది అనుకుంటారు.. కానీ ఓ సినిమాను విశ్లేషించే పద్ధతిలో రామ్ గోపాల్ వర్మ చాలా విభిన్నంగా ఆలోచిస్తాడు.
సాధారణంగా ప్రతి విషయంపై విమర్శలు చేయడం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) కు అలవాటు. ఆయన ఏం మాట్లాడినా కూడా నెగిటివ్ సెన్స్లోనే ఉంటుందని చాలా మంది అనుకుంటారు.. కానీ ఓ సినిమాను విశ్లేషించే పద్ధతిలో రామ్ గోపాల్ వర్మ చాలా విభిన్నంగా ఆలోచిస్తాడు. మిగిలిన దర్శకుల కంటే ఆయన విశ్లేషణ అద్భుతంగా ఉంటుందని కొందరి వాదన. కాకపోతే ప్రతిసారి చిత్రవిచిత్రమైన కామెంట్స్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఈయనను ఈ మధ్య ఎవరు పట్టించుకోవడం లేదు. కానీ ఒక్కసారి వర్మ కాన్సన్ట్రేట్ చేసి సినిమా గురించి మాట్లాడడం మొదలు పెడితే.. ఆయన కంటే ఎవరు బాగా మాట్లాడలేరు. వర్మ బుర్రలో ఉన్నంత సినిమా జ్ఞానం మరే ఇతర ఇండియన్ దర్శకుడి బుర్రలో లేదని ఆయన అభిమానులతో పాటు చాలామంది చెబుతుంటారు. అందుకే ఇండియన్ సినిమాకు ఎన్నో సరికొత్త టెక్నాలజీలు పరిచయం చేసిన దర్శకుడుగా ఆయన చరిత్ర సృష్టించాడు.
అప్పట్లో బాహుబలి (Bahubali) సినిమాను వర్మ విశ్లేషించిన తీరు అందరినీ అబ్బుర పరిచింది. ఎప్పుడైతే హీరో కంటే కథ పెద్దగా ఉంటుందో అప్పుడే బాహుబలి లాంటి సినిమాలు వస్తాయి అంటూ సంచలన కామెంట్స్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. దర్శకుడికి పూర్తి అధికారం ఇస్తే ఎలాంటి సినిమాలు వస్తాయి అని చెప్పడానికి రాజమౌళి (Rajamouli) పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటూ ఇప్పటికే ఆయనపై ఎన్నోసార్లు ప్రశంసల వర్షం కురిపించాడు. తాజాగా ట్రిపుల్ ఆర్ (RRR) సినిమా విషయంలో కూడా ఇదే చేస్తున్నాడు ఈ సంచలన దర్శకుడు.
BAHUBALI 2 is history, RRR is HISTORICAL and @ssrajamouli is MYSTICAL for making the boxoffice SPIRITUAL 🙏🙏🙏
ఈ సినిమాపై వర్మ (Varma) ఇచ్చిన రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. త్రిబుల్ ఆర్ లాంటి సినిమా జీవితంలో ఒకేసారి వచ్చే ఎక్స్పీరియన్స్ అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు ఈ దర్శకుడు. ఇండియన్ సినిమా రూపురేఖలను సినిమా సినిమాతో మార్చేస్తున్నాడు రాజమౌళి అంటూ పొగడ్తల వర్షం కురిపించాడు. ఇద్దరు స్టార్ హీరోలు సినిమాలో ఉన్నప్పుడు కచ్చితంగా కథ గాడి తప్పే ప్రమాదం ఉందని.. ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని అద్భుతంగా తెరకెక్కించాడు అంటూ చెప్పుకొచ్చాడు.
అలాగే చరణ్ (Ram Charan), ఎన్టీఆర్ (Jr NTR) ఇద్దరు అద్భుతమైన నటనతో సినిమా స్థాయి పెంచారంటూ పొగిడాడు. అలాగే ఈ ఇద్దరి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయని తెలిపాడు. అంతేకాదు హాలీవుడ్ మార్వెల్ ఫిలింస్ కంటే ఇది ఏమాత్రం తక్కువ కాదని.. సినిమాలోని ప్రతి ఫ్రేమ్ తాను ఎంతో బాగా ఎంజాయ్ చేశానని చెప్పాడు రామ్ గోపాల్ వర్మ. రాజమౌళి అనే వాడు కేవలం తెలుగు సినిమా, ఇండియన్ సినిమా ఆస్తి మాత్రమే కాదు.. ప్రేక్షకులు ఆస్తి అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు RGV. అందుకే ఆయన కోట్లాది మంది గుండెల్లో ఉన్నాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఏదేమైనా త్రిపుల్ ఆర్ సినిమా కచ్చితంగా అందరు చూడాలని.. జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఈ సినిమా అంటూ రివ్యూ పోస్ట్ చేశాడు వర్మ. ప్రస్తుతం ఈ రోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.