సూపర్ స్టార్ మహేష్ బాబుపై వర్మ సంచలన ట్వీట్.. కులాభిమానం గొప్పదంటూ..

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎపుడు ఏమి చేసినా ఏదో ఒక వివాదం ఉండాల్సిందే. తాజాగా వర్మ..మహేష్ బాబును ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.

news18-telugu
Updated: August 11, 2019, 10:31 AM IST
సూపర్ స్టార్ మహేష్ బాబుపై వర్మ సంచలన ట్వీట్.. కులాభిమానం గొప్పదంటూ..
మహేష్ బాబు,రామ్ గోపాల్ వర్మ (ట్విట్టర్ ఫోటో)
  • Share this:
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎపుడు ఏమి చేసినా ఏదో ఒక వివాదం ఉండాల్సిందే. అసలు వివాదం లేనిదే రామ్ గోపాల్ వర్మ లేనట్టు తన ట్వీట్స్‌తో కాక పుట్టిస్తుంటాడు. తాజగా వర్మ ..మహేష్ బాబు యాక్ట్ చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ ఇంట్రో సాంగ్‌ను తను తెరకెక్కిస్తోన్న ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సాంగ్‌ను సరిగ్గా టైమ్ చూసుకొని  మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసాడు. వర్మ రిలీజ్ చేసిన ఈ పాట సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. దీనిపై  రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. తమ పాట గూగుల్ ట్రెండ్స్‌లో దూసుకుపోతుందని వ్యాఖ్యానించాడు. అంతేకాదు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు యాక్ట్  చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’లోని ఇంట్రో సాంగ్ కంటే ఈ వీడియో పాటకే ఆదరణ లభించందని ట్వీట్ చేసాడు.ఇక రామ్ గోపాల్ వర్మ రిలీజ్ చేసిన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ ప్రస్తుతం ట్రెండింగ్‌లో రెండో స్థానంలో ఉంది. మరోవైపు వర్మ మాట్లాడుతూ.. సూపర్ స్టార్స్ కంటే ప్రేక్షకులకు కులాభిమానమే ఎక్కువైంది. ఇది మంచి పరిణామం కాదని ట్వీట్ చేసాడు. ఏమైనా రామ్ గోపాల్ వర్మ తీరు చూసిన వాళ్లు అదేదో గిల్లి జోలి పాట పాడినట్లు ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.
First published: August 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు