అవును.. ఈ మాటలు చెప్పింది ఎవరో కాదు.. సాక్షాత్తు రామ్ గోపాల్ వర్మే. ఆయనే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను యూ ట్యూబ్‌లో విడుదల చేయండి అంటూ చెప్పాడు. అయితే దీని వెనక ఓ కథ ఉంది. అదేంటి.. మార్చ్ 22న విడుదల కానున్న సినిమాను పట్టుకుని యూ ట్యూబ్ విడుదల అంటారేంటి.. కొంపదీసి ఈ చిత్రాన్ని కానీ విడుదల కాకుండా ఎవరైనా ఆపేసారా ఏంటి అనుకుంటున్నారా..? అలాంటిదేం జరగలేదు.. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా అనుకున్నట్లుగానే విడుదలవుతుంది. కానీ ఇక్కడ చిన్న ట్విస్ట్ కూడా ఉంది.
ఈ చిత్రంలో ఉన్న కాంట్రవర్సీల కారణంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా అసలు విడుదలవుతుందా లేదా అనేది చాలా మందిలో అనుమానం ఉంది. అయితే ఈ చిత్రం విడుదల ఆగాలంటే తనను చంపాలని.. అలా చంపినా కూడా ఈ చిత్రం విడుదల కాకుండా ఆపలేరంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు వర్మ. ఒకవేళ ఎవరైనా తనపై దాడి చేసి చంపేసినా కూడా ఈ చిత్రం మాత్రం ప్రేక్షకుల ముందుకు రాకుండా ఆపలేరని సవాల్ చేస్తున్నాడు వర్మ. తననెవరైనా చంపేస్తే.. ఈ చిత్రాన్ని యూ ట్యూబ్ లో విడుదల చేయాలంటూ చీటీ రాసి పెట్టానంటున్నాడు ఈ దర్శకుడు.
ఇప్పటికే హార్డ్ డిస్కులో సినిమా కాపీ చేసి పెట్టానని.. దాన్ని తీసి విడుదల చేయండంటున్నాడు ఈయన. ఈ మాటలను బట్టే అర్థమవుతుంది వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఎంత సీరియస్ గా తీసుకున్నాడో అని. మొత్తానికి చూడాలిక.. ఈ చిత్రం విడుదలకు ముందే ఇంతగా సంచలనం చేస్తుంటే విడుదల తర్వాత ఏం జరుగుతుందో మరి..?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Lakshmi Parvathi, Lakshmis NTR, RGV, Telugu Cinema, Tollywood, Youtube