పప్పులాంటి అబ్బాయి వీడియో సాంగ్‌ను విడుదల చేసిన వర్మ..

Pappu Laanti Abbayi Video song talk : రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే వివాదస్పద సినిమా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’కు సంబందించిన ట్రైలర్‌ను విడుదల చేయగా... తాజాగా ఆయన పప్పు లాంటి అబ్బాయి అంటూ సాగే మరో వీడియో సాంగ్‌ను విడుదల చేశాడు.

news18-telugu
Updated: November 10, 2019, 10:38 AM IST
పప్పులాంటి అబ్బాయి వీడియో సాంగ్‌ను విడుదల చేసిన వర్మ..
Youtube
  • Share this:
Pappu Laanti Abbayi Video song talk : సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వివాదస్పద సినిమా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’కు సంబందించిన ట్రైలర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈరోజు ఆ సినిమాలో 'పప్పులాంటి అబ్బాయి' పాట వీడియో సాంగ్‌ను విడుదల చేసాడు వర్మ.  పప్పులాంటి అబ్బాయి పాత్ర ఓ ఏపీలోని ప్రముఖ రాజకీయ పార్టీ అధినేత కుమారుడిని ఉద్దేశించినట్లు కనిపిస్తోందని వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ప్రధానంగా.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ పరాజయం తర్వాత జరిగిన సంఘటన ఆధారంగా వస్తున్నట్లు ట్రైలర్‌ను చూస్తుంటే తెలుస్తోంది.  ఇప్పటికే వర్మ  కేఏ పాల్ పై తీసిన ఓ సాంగ్‌ను విడుదల చేయగా.. తాజాగా ఆయన మరో పాటను విడుదల చేశాడు. కాగా ఈరోజు విడుదలైన పాటలో సైకిల్ గురించి, తాతనుండి సైకిల్ లాగేసున్న విధానం గురించి, పార్టీకి భాద్యత వహించాల్సిన వ్యక్తుల గురించి, రాబోయే రోజుల్లో పార్టీ భవిష్యత్తు ఎలా ఉండనుందో.. ఎవరు చార్జ్ తీసుకోవాలో.. ఇలా పాటలో చాలానే చర్చిస్తూ.. విజువల్స్‌తో ఆసక్తిగా చూపించారు.







యాంకర్ మంజూష అదిరే అందాలు...
Published by: Suresh Rachamalla
First published: November 10, 2019, 10:31 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading