RGV Power Star: చంద్రబాబుతో పవర్ స్టార్ రాజకీయం..

Pawan Kalyan RGV Power Star: పవన్ కళ్యాణ్ జోలికి కానీ.. అతడి కుటుంబం జోలికి కానీ ఎప్పుడూ వెళ్ళనని మాటిచ్చిన వర్మ.. ఇప్పుడు ఆ మాట తీసి గట్టుమీద పెట్టేసాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 13, 2020, 11:05 PM IST
RGV Power Star: చంద్రబాబుతో పవర్ స్టార్ రాజకీయం..
వర్మ పవర్ స్టార్ ఫస్ట్ లుక్ (Power Star movie/Twitter)
  • Share this:
పవన్ కళ్యాణ్ జోలికి కానీ.. అతడి కుటుంబం జోలికి కానీ ఎప్పుడూ వెళ్ళనని మాటిచ్చిన వర్మ.. ఇప్పుడు ఆ మాట తీసి గట్టుమీద పెట్టేసాడు. తనకు కావాల్సినట్లుగా ఓ కథ రాసుకుని పవర్ స్టార్ అనే సినిమా చేస్తున్నాడు. అడిగితే ఎప్పట్లాగే నా యిష్టం అంటున్నాడు ఈ దర్శకుడు. పవన్ కళ్యాణ్ గతేడాది జనసేన తరఫున పోటీ చేసి ఒకే ఒక్క సీట్ సంపాదించాడు. తను పోటీ చేసిన రెండు చోట్ల కూడా ఓడిపోయాడు. ఈ దారుణమైన పరాభవం తర్వాత కూడా పవన్ పుంజుకుని ప్రజల మధ్యలోనే ఉంటున్నాడు.


అయితే ఇప్పుడు వర్మ మాత్రం పొలిటికల్ ఫెయిల్యూర్‌ను టార్గెట్ చేసి సినిమా చేస్తున్నాడు. పవర్ స్టార్ అంటూ టైటిల్ పెట్టి.. ఎన్నికల తర్వాత కథ అంటున్నాడు ఈ దర్శక నిర్మాత. ఇప్పటికే ఈ సినిమా నుంచి దాదాపు అరడజన్‌కు పైగానే పోస్టర్లు కూడా విడుదల చేసాడు. దీనిపై పవన్ ఫ్యాన్స్ మండి పడుతున్నారు. ఎందుకు అనవసరంగా పవన్‌ను టార్గెట్ చేస్తున్నారు.. ఆయన పని ఆయన చేసుకుంటుంటే ఎందుకు మీరు కెలుకుతున్నానరంటూ ఫైర్ అవుతున్నారు. దీనికి వర్మ కూడా నా యిష్టం అంటూ సమాధానమిచ్చాడు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి చాలా పోస్టర్స్ విడుదల చేసాడు దర్శకుడు వర్మ. రష్యన్ అమ్మాయితో ఉన్న ఫోటోతో పాటు ఆవులకు గడ్డి వేస్తున్న ఫోటో.. గడ్డి మోసుకుంటూ వెళ్తున్న ఫోటో.. ఓ దర్శకుడిని కొడుతున్న ఫోటో.. మాట్లాడుతున్న ఫోటో.. టీ తాగుతున్న పోటో ఇలా చాలానే విడుదల చేసాడు వర్మ. ఇప్పుడు చంద్రబాబును పోలిన వ్యక్తితో పవర్ స్టార్ రాజకీయం చేస్తున్నట్లు పోస్టర్ విడుదల చేసాడు ఆర్జీవీ. అసలు ఇలా ఎందుకు చేస్తున్నాడనేది మాత్రం అర్థం కావడం లేదు.

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కూడా ఈ చిత్రం గురించి అస్సలు పట్టించుకోవడం లేదని తెలుస్తుంది. అనవసరంగా మీరు పట్టించుకుని సినిమాను పెద్దది చేయొద్దని.. దానికి అంత సీన్ లేదని పవన్ తన సన్నిహితులతో చెప్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాను తానే లైట్ తీసుకున్నాను.. మీరు కూడా అదే చేయాలంటూ పవన్ కోరుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వర్మ అంతే.. ఆయన గురించి ఎవరికి తెలియదు.. వదిలేయండి అంటూ పవన్ చెప్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరి చూడాలిక.. ఈ సినిమాలో ఇంకా ఎన్ని విచిత్రాలు వర్మ చూపించబోతున్నాడో..?
Published by: Praveen Kumar Vadla
First published: July 13, 2020, 11:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading