పోలీసుల పంచ్‌కు వర్మకు మైండ్ బ్లాంక్.. నాకు రెండో కూతురుంటే నీకే ఇస్తా అంటూ..

సైబరాబాద్ పోలీసుల ట్వీట్‌ను అలాగే వదిలేస్తే అతను వర్మ ఎందుకు అవుతాడు. పోలీసుల ట్వీట్‌ను రీ ట్వీట్ చేసిన వర్మ.. వారిని పొగడ్తల్లో ముంచెత్తాడు.

news18-telugu
Updated: July 20, 2019, 10:33 PM IST
పోలీసుల పంచ్‌కు వర్మకు మైండ్ బ్లాంక్.. నాకు రెండో కూతురుంటే నీకే ఇస్తా అంటూ..
రామ్ గోపాల్ వర్మ త్రిపుల్ రైడింగ్ (ట్విట్టర్ ఫోటో)
  • Share this:
సినీ దర్శకుడు, నిర్మాత రామ్ గోపాల్ వర్మకు పోటీసులు ఇచ్చిన సమాధానం చూసి మైండ్ బ్లాంక్ అయి ఉంటుంది. ఇస్మార్ట్ శంకర్ సినిమా చూసేందుకు రామ్ గోపాల్ వర్మ.. ఆర్ ఎక్స్ 100 సినిమా డైరెక్టర్ భూపతి, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా డైరెక్టర్ అగస్త్యతో కలసి రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ మీద వెళ్లాడు. అయితే, హెల్మెట్ లేకుండా ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న ఫొటోను తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశాడు. ఈ సందర్భంగా పోలీసుల మీద తనదైన శైలిలో సెటైర్ వేశాడు. ‘పోలీసులు ఎక్కడ? ఓహో అందరూ ధియేటర్ లోపల సినిమా చూస్తున్నట్టున్నారు.’ అంటూ ట్వీట్ చేశాడు. అయితే, రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చూసిన పోలీసులు వెంటనే రియాక్ట్ అయ్యారు. ఆ వాహనానికి రూ.1300 జరిమానా విధించారు. అయితే, కథ ఇంతటితో అయిపోలేదు. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మను ట్యాగ్ చేస్తూ సైబరాబాద్ పోలీసులు ఓ ట్వీట్ చేశారు. అందులో ‘ట్రాఫిల్ ఉల్లంఘనలను మా దృష్టికి తీసుకొచ్చినందుకు రామ్ గోపాల్ వర్మకు థాంక్స్. మీరు వ్యక్తిగతంగా కూడా అంతే బాధ్యతతో ఉండాలని కోరుకుంటున్నాం. ఇంకో విషయం.. ధియేటర్లలోనే ఎందుకు? బయట ఈ క్రింది లాంటి డ్రామా (అక్కడ వర్మ ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న ఫొటోలు ఉన్నాయి.) సర్కర్ రోడ్డు మీద నిమిషానికొకటి చూస్తుంటాం.’ అని ట్వీట్ చేశారు.వారి ట్వీట్‌ను అలాగే వదిలేస్తే అతను వర్మ ఎందుకు అవుతాడు. పోలీసుల ట్వీట్‌ను రీ ట్వీట్ చేసిన వర్మ.. వారిని పొగడ్తల్లో ముంచెత్తాడు. 39 రోజుల పాటు నాన్‌స్టాప్ ముద్దులు పెట్టాలని ఉందన్నాడు. అంతేకాదు, తనకు రెండో కూతురు ఉంటే కచ్చితంగా నీకే ఇచ్చి.. అల్లుడిని చేసుకుంటా అంటూ ట్వీట్ చేశాడు.ః

First published: July 20, 2019, 10:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading