‘రామ్ గోపాల్ వర్మ మందు పార్టీపై రజనీకాంత్ రియాక్షన్..’

Ram Gopal Varma | ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ కావడంతో రామ్ గోపాల్ వర్మ ఫుల్లు పార్టీలతో రచ్చ రచ్చ చేస్తున్నాడు.

news18-telugu
Updated: July 21, 2019, 3:26 PM IST
‘రామ్ గోపాల్ వర్మ మందు పార్టీపై రజనీకాంత్ రియాక్షన్..’
రాము రచ్చ రచ్చ (Image : Twitter)
  • Share this:
పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ధియేటర్లలో దుమ్ము దులుపుతోంది. మాస్ ఆడియన్స్‌కు చాన్నాళ్లకు ఓ కిక్కిచ్చే సినిమా వచ్చింది. దీంతో కలెక్షన్లు దూసుకుపోతున్నాయి. ధియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయి. చాలా రోజుల తర్వాత సక్సెస్ రావడంతో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఫుల్ ఖుషీ అవుతున్నాడు. పూరీ జగన్నాథ్ కంటే రామ్ గోపాల్ వర్మ ఆనందం పట్టలేకుండా ఉంది. పూరీ, ఛార్మి, నిధి అగర్వాల్‌తో కలసి ఫుల్లుగా మందు పార్టీ చేసుకుని, ఆ ఫొటోలు వీడియోలు పోస్ట్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నాడు. సినిమా చూడడానికి ట్రిపుల్ రైడింగ్ చేసి.. ఆ ఫొటోలు వీడియోలు ట్విట్టర్‌లో పోస్ట్ చేసి పోలీసులకే సవాల్ విసిరాడు. అయితే, తాజాగా ఈ సినిమా గురించి మరో రకంగా ట్వీట్ చేశాడు రామ్ గోపాల్ వర్మ ఇస్మార్ట్ శంకర్ సినిమా సక్సెస్‌ పార్టీని చూసి రజనీకాంత్ రియాక్షన్ ఇదేనంటూ ఓ వీడియోను పోస్ట్ చేశాడు. చంద్రముఖి సినిమాలో క్లైమాక్స్ సీన్‌‌ను ఎడిటింగ్ చేసి.. మధ్యలో వర్మ పార్టీ విజువల్స్ వేసి.. ఆ వీడియోను పోస్ట్ చేశాడు.First published: July 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>