సైరా ట్రైలర్‌పై ఊహించని కామెంట్స్ చేసిన రామ్ గోపాల్ వర్మ..

సాధారణంగానే రామ్ గోపాల్ వర్మ రియాక్షన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచం అంతా బాగుందంటే ఈయనొక్కడే బాలేదంటాడు. అంతా ఏముంది ఇందులో అంటే.. ఆహా ఏం ఉందిది అంటాడు వర్మ.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 26, 2019, 2:57 PM IST
సైరా ట్రైలర్‌పై ఊహించని కామెంట్స్ చేసిన రామ్ గోపాల్ వర్మ..
సైరా వర్మ ఫైల్ ఫోటోస్ (Source: Twitter)
  • Share this:
సాధారణంగానే రామ్ గోపాల్ వర్మ రియాక్షన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచం అంతా బాగుందంటే ఈయనొక్కడే బాలేదంటాడు. అంతా ఏముంది ఇందులో అంటే.. ఆహా ఏం ఉందిది అంటాడు వర్మ. అలాంటి కారెక్టర్ ఆయన సొంతం. వర్మ బుర్ర ఎప్పుడెలా ఆలోచిస్తుందో చెప్పడం కష్టం. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. ఈయన సైరా ట్రైలర్‌పై తన రియాక్షన్ ట్వీట్ చేసాడు. ఇది చూసిన తర్వాత మెగా ఫ్యాన్స్ ఒక్కరే కాదు అంతా షాక్ అయ్యారు. ఈయనేంటి ఇలా మారిపోయాడు. అసలు నిజంగానే వర్మ ఈ ట్వీట్ చేసాడా లేదంటే ఆయన ట్విట్టర్ ఎవరైనా హ్యాక్ చేసి అలా పోస్ట్ చేసారా అనిపించింది ఇది చూస్తుంటే.


అంత షాక్ ఇచ్చాడు ఈయన. సైరా రెండో ట్రైలర్ విడుదలై.. యూ ట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ ట్రైలర్ చూసి అంతా ఫిదా అయిపోతున్నారు కూడా. చిరంజీవి ఈ వయసులో కూడా ఆ స్థాయి పోరాటాలు చేస్తుంటే ఔరా అంటున్నారు. ఇక ఇప్పుడు వర్మ కూడా ఇంచుమించు ఇదే అనేసాడు. సైరా ట్రైలర్ చూసిన తర్వాత ఆయన ప్రశంసల వర్షం కురిపించాడు.

ముఖ్యంగా చిరంజీవిని ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటున్నారో అలాంటి సినిమా ఇది అంటున్నాడు. చిరు స్థాయికి తగ్గ సినిమా చేసి.. తెలుగు సినిమా గౌరవాన్ని కూడా పెంచిన రామ్ చరణ్‌కు ధన్యవాదాలు తెలిపాడు వర్మ. అసలు ఆర్జీవీ నుంచి ఇలాంటి పాజిటివ్ రివ్యూ రావడం నిజంగానే అద్భుతం. మొత్తానికి వర్మ ఏ మూడ్‌లో ఉన్నాడో తెలియదు కానీ ఆయన రివ్యూ మాత్రం ఇప్పుడు సంచలనంగా మారుతుంది.
Published by: Praveen Kumar Vadla
First published: September 26, 2019, 2:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading