HOME » NEWS » movies » RAM GOPAL VARMA NOT ACCEPTED RAJAMOULI GREEN INDIA CHALLENGE TA

RGV-Rajamouli: సోషల్ మీడియా వేదికగా రాజమౌళిని ఘోరంగా అవమానించిన రామ్ గోపాల్ వర్మ..

RGV-Rajamouli: దర్శక బాహుబలి రాజమౌళిని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా ఘోరంగా అవమానించాడు. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: November 11, 2020, 4:12 PM IST
RGV-Rajamouli: సోషల్ మీడియా వేదికగా రాజమౌళిని ఘోరంగా అవమానించిన రామ్ గోపాల్ వర్మ..
రాజమౌళి,రామ్ గోపాల్ వర్మ (File/Photo)
  • Share this:
RGV-Rajamouli: దర్శక బాహుబలి రాజమౌళిని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా ఘోరంగా అవమానించాడు. వివరాల్లోకి వెళితే.. రాజమౌళి.. ఈ రోజు రామ్ చరణ్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తన ఆర్ఆర్ఆర్ టీమ్‌తో కలిసి లింగంపల్లిలోని ఆర్ఆర్ఆర్ షూటింగ్ లొకేషన్‌లో 25 టీమ్ మెంబర్స్‌తో కలిసి మొక్కలు నాటి సెల్పీలు దిగారు. ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో రౌద్రం రణం రుధిరం సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా రాజమౌళి.. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, వినాయక్, పూరీ జగన్నాథ్‌లను మొక్కలు నాటాలని గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌‌లో భాగంగా నామినేట్ చేసారు. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించనని ట్వీట్ చేసి మరి రాజమౌళికి భారీ ఝలక్ ఇచ్చాడు.

ఈ సందర్భంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. రాజమౌళి సర్.. నేను గ్రీన్‌కు.. ఛాలెంజ్‌లకు చాలా దూరం. మట్టిని ముట్టుకోవడం అంటే నాకు అసహ్యం. మొక్కలను నాలాంటి స్వార్ధపరుడి అవసరం అంటూ కొంటె సమాధానమిచ్చాడు. మీకు, మీ మొక్కలకు ఆల్ ది బెస్ట్ అంటూ వర్మ పేర్కొన్నాడు. మొత్తంగా రామ్ గోపాల్ వర్మ.. మరోసారి తనదైన శైలిలో ట్వీట్ చేసి మరోసారి వార్తల్లో నిలిచాడు. ఏమైనా రామ్ గోపాల్ వర్మ.. ఎంతో ధైర్యంగా ఈ ఛాలెంజ్ స్వీకరించనని చెప్పడం ఆయన గట్స్‌కు నిదర్శనం అంటున్మనారు ఆయన అభిమానులు. మరికొంత మంది నెటిజన్లు మాట్లాడుతూ.. చాలా మంది సెలబ్రిటీలు ఏదో నామ్ కే వాస్తే.. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు తూతూ మంత్రంగా మొక్కలు నాడుతున్నారు. ఆ తర్వాత వాటి ఆలనా పాలనా చూడటం లేదు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం సరిగా కొనసాగడం లేదనే అభిప్రాయం చాల ామంది ప్రజల్లో నెలకొంది. ఏమైనా రామ్ గోపాల్ వర్మ ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టేలా మాట్లాడంతో మరోసారి వార్తల్లో నిలిచాడు.
Published by: Kiran Kumar Thanjavur
First published: November 11, 2020, 4:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading