Ram Gopal Varma : మెగా ఫ్యామిలీలో మరో ముఖ్య వ్యక్తిపై వర్మ సినిమా.. ఆసక్తికరంగా టైటిల్..

Ram Gopal Varma : ఈ లాక్ డౌన్‌లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ.. తక్కువ బడ్జెట్‌లో తీస్తూ.. వాటిని తన డిజిటల్ ప్లాట్ ఫామ్‌లో విడదుల చేస్తూ.. నాలుగు రాళ్లు వేనకేసుకుంటున్నాడు వర్మ.

news18-telugu
Updated: July 30, 2020, 8:54 AM IST
Ram Gopal Varma : మెగా ఫ్యామిలీలో మరో ముఖ్య వ్యక్తిపై వర్మ సినిమా.. ఆసక్తికరంగా టైటిల్..
ఆర్జీవీ Photo : Twitter
  • Share this:
Ram Gopal Varma : ఈ లాక్ డౌన్‌లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ.. తక్కువ బడ్జెట్‌లో తీస్తూ.. వాటిని తన డిజిటల్ ప్లాట్ ఫామ్‌లో విడదుల చేస్తూ.. నాలుగు రాళ్లు వేనకేసుకుంటున్నాడు వర్మ. ఆయన తాజాగా పవర్ స్టార్ పేరుతో ఓ సినిమాను తీసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ వర్మ చేసిన ఆ మూవీ ఎన్ని వివాదాలకు దారి తీసిందో తెలిసిందే. ఈ సినిమాను వ్యతిరేకిస్తూ పవన్ ఫ్యాన్స్ వర్మపై ఆన్ లైన్‌లోను ఆఫ్ లైన్‌లోను ఆగ్రహాం వ్యక్తం చేశారు. అంతేకాదు కొంత మంది చివరకు వర్మ ఆఫీస్ పై దాడి చేయడం జరిగింది. అయినా ఎట్టకేలకు ఆయన తన సినిమా పవర్ స్టార్‌ను తన డిజిటల్ ఫ్లాట్ ఫామ్ వర్మ వరల్డ్ థియేటర్‌లో విడుదల చేశాడు. అది అలా ఉంటే ఆయన మరో వివాదానికి తెరలేపుతున్నట్లు సమాచారం అందుతోంది. వర్మ మెగా ఫ్యామిలీకి చెందిన నిర్మాత అల్లు అరవింద్ పై మూవీకి సిద్ధం అవుతున్నాడని, సమాచారం. అలాగే ఆ మూవీకి టైటిల్ గా బావ రాజ్యం అనే టైటిల్ కూడా అనుకుంటున్నాడనే ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా ముఖ్యంగా ప్రజారాజ్యం పార్టీ, అరవింద్ పాత్రపై ఉంటుందని టాక్. చిరంజీవి 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు, ఆ పార్టీలో కీలక పాత్రను అల్లు అరవింద్ పోషించాడు. అందులో భాగంగా ఆయన నియోజకవర్గాల సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక వంటి అనేక విషయాలను చూసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే వర్మ తన బావరాజ్యం మూవీని తెరకెక్కించనున్నాడని సమాచారం. ఒక వేళా ఇదే విషయంపై మూవీ చేస్తే వర్మ మరో సంచలనానికి తెరలేపడం ఖాయం.


ఇక ఈ లాక్ డౌన్ ఆయన తీసిన మొదటి సినిమా క్లైమాక్స్. అడల్ట్ స్టార్ మియా మాల్కోవాతో ఆ సినిమా తీసిన ఆయన.. ఆ తర్వాత కొత్త అమ్మాయి శ్రీ రాపాకతో నగ్నం తీసి షాక్ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత మర్డర్ అని, థ్రిల్లర్ అని రెండు మూడు సినిమాలు ప్రకటించిన వర్మ.. తాజాగా మర్డర్ సినిమాకు సంబందించిన ట్రైలర్‌ను విడుదల చేసాడు. ఈ సినిమా ప్రణయ్, అమృత జీవితాల ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ సినిమా ఎన్ని వివాదాలను మూటగట్టుకుంటుందో చూడాలి.
Published by: Suresh Rachamalla
First published: July 30, 2020, 8:50 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading