వర్మ పవర్ స్టార్ సినిమా ఎవరి గురించి.. ఆసక్తికరంగా టైటిల్ లోగో...

Varma Power star : ప్రముఖ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య కేవలం కాంట్రవర్సీ, అడల్ట్ కంటెంట్ నమ్ముకొని సినిమాలు తీస్తూ.. డబ్బు చేసుకుంటున్నాడు.

news18-telugu
Updated: July 9, 2020, 11:25 AM IST
వర్మ పవర్ స్టార్ సినిమా ఎవరి గురించి.. ఆసక్తికరంగా టైటిల్ లోగో...
వర్మ పవర్ స్టార్ Photo : Twitter
  • Share this:
ప్రముఖ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య కేవలం కాంట్రవర్సీ, అడల్ట్ కంటెంట్ నమ్ముకొని సినిమాలు తీస్తూ.. డబ్బు చేసుకుంటున్నాడు. కరోనా కారణంగా థియేటర్స్ అన్ని బంద్ అవ్వడంతో ఆయన ఆర్ జి వి వరల్డ్ థియేటర్ పేరుతో ఓ యాప్‌ను డెవలప్ చేసి తన సినిమాలను అక్కడే విడుదల చేస్తున్నాడు. ఈ ఐడియా సూపర్ సక్సెస్ కావడంతో.. ఆయనకు కాసులు కురిపిస్తోంది. ఒక్కో సినిమాకు ఒక్కో తలకు వంద నుండి రెండు వందల వరకు వసూలు చేస్తుండటంతో తన వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తోంది. దీనితో ఆయన వరుసగా సినిమాలు చేస్తున్నారు. వారానికి ఒక సినిమా చొప్పున తన థియేటర్‌లో సినిమాలను విడుదలచేస్తూ అదరగొడుతున్నాడు. అలా కొద్దిరోజుల వ్యవధిలోనే మియా మాల్కోవాతో క్లైమాక్స్, శ్రీ రాపాకతో నగ్నం సినిమాలను తీసి విడుదల చేసిన వర్మ మరో నాలుగు ప్రాజెక్ట్స్ ప్రకటించాడు. అందులో కొంత ఎక్కువ వివాదస్పదమవుతోన్న సినిమాల్లో పవర్ స్టార్ ఒకటి.


తాజాగా పవర్ స్టార్ ప్రీ లుక్ పోస్టర్ విడుదల చేసిన వర్మ అందులో అభ్యంతరకర అంశాలు జోడించాడు. ఆ టైటిల్‌లోగోలో టీ గ్లాసు ఉండడం ఆసక్తి రేపుతోంది. వర్మ మాత్రం ఇది ఎవరిని ఉద్దేశించి తీస్తున్న సినిమా కాదని చెపుతోన్న.. ఈ సినిమా ఓ వ్యక్తికి ఓ వర్గానికి బాగా కోపం తెప్పించే అంశమే అవుతుంది. ఇక వర్మ ఈరోజు ఉదయం 11: 37 నిమిషాలకు పవర్ స్టార్ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నానని తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఆ లుక్ ఎన్ని వివాదాలను తెస్తుందో చూడాలి.
Published by: Suresh Rachamalla
First published: July 9, 2020, 11:25 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading