మెగా ఫ్యామిలీపై.. కొత్త సినిమాను ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ..

Ram Gopal Varma : రామ్ గోపాల్ వర్మ ఓ సంచలన దర్శకుడు . ఆయన ఏమి చేసినా ఒక సెన్సేషనే. కాగా  వర్మ మరో వివాదానికి తెర తీశాడు. 'మెగా ఫ్యామిలీ' పేరుతో ఓ కొత్త సినిమాను ప్రకటించాడు.

news18-telugu
Updated: October 29, 2019, 8:06 AM IST
మెగా ఫ్యామిలీపై.. కొత్త సినిమాను ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ..
రాంగోపాల్ వర్మ (File)
  • Share this:
Ram Gopal Varma : రామ్ గోపాల్ వర్మ ఓ సంచలన దర్శకుడు . ఆయన ఏమి చేసినా ఒక సెన్సేషనే. కాగా  వర్మ మరో వివాదానికి తెర తీశాడు. రామ్ గోపాల్ వర్మ తన సినిమాలతో కన్నా... వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో ఉంటున్నాడు. అందులో భాగంగా తాజాగా  ఆయన మరో సినిమాను అనౌన్స్ చేశాడు. రెండు రోజుల క్రితమే 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే సినిమాకు సంబందించిన ట్రైలర్‌ను విడుదల చేసిన వర్మ.. మరో సంచలనానికి తెర లేపాడు. 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా తర్వాత తాను 'మెగా ఫ్యామిలీ' టైటిల్‌తో ఓ సినిమా తీస్తానని ప్రకటించాడు. ఇదే విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్ ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. అంతేకాదు 'మెగా ఫ్యామిలీ' సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఈరోజు 9.30కి వెల్లడిస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కోన్నారు. ఈ కొత్త సినిమా ప్రకటనతో.. సినీ అభిమానుల్లో ఆత్రుత, ఆసక్తి మొదలైంది. అసలు ఆ సినిమాలో ఏమి చూపించబోతున్నారు.. ఎవరీ గురించి ఆ సినిమా అంటూ ఆరాలు తీస్తూ.. తెగ కామెంట్స్ పెడుతున్నారు.


కాగా వర్మ గతంలో ఎన్నికలకు ముందు 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' పేరుతో ఎన్టీఆర్‌, లక్ష్మీ పార్వతిల అనుబంధం నేపథ్యంలో సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన  'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అంటూ ఇప్పటికే మరో వివాదాస్పద చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నెంబర్ స్థానంలో అదరగొడుతూ.. విపరీతంగా వీక్షకుల్నీ ఆకర్షిస్తోంది. ఆ ట్రైలర్‌ను బట్టీ చూస్తే..  గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమి, తరువాతి పరిణామాల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.


నిధి అగర్వాల్ హాట్ పిక్స్...
First published: October 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు