హైదరాబాద్ దాదాలను టార్గెట్ చేసిన వర్మ.. కొత్త సినిమా ప్రకటన..
రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఏదో ఓ సినిమా చేస్తూనే ఉంటారు. ఓ సినిమా షూటింగ్లో ఉండగానే మరో రెండు సినిమాలకు ప్రకటన ఇస్తారు వర్మ.
news18-telugu
Updated: November 19, 2019, 9:59 AM IST

- News18 Telugu
- Last Updated: November 19, 2019, 9:59 AM IST
రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఏదో ఓ సినిమా చేస్తూనే ఉంటారు. ఓ సినిమా షూటింగ్లో ఉండగానే మరో రెండు సినిమాలకు ప్రకటన ఇస్తారు వర్మ. ఇప్పుడు అదే జరిగింది. ఆయన తాజాగా తీస్తున్న కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా షూటింగ్ ముగించుకుందో లేదో మరో సినిమాను ప్రకటించాడు వర్మ. షార్ట్ ఫిల్మ్ తీసినంత ఈజీగా వర్మ సినిమాను ముగించేస్తారు. దీనికి తోడు వివాదస్పద సినిమా టైటిల్స్‌తో కావల్సినంత ప్రచారాన్ని రూపాయి ఖర్చు లేకుండా పొందుతాడు వర్మ. అందులో భాగంగా వివాదమే పెట్టుబడిగా, విమర్శలే ప్రచారంగా వాడుకుంటూ ఆ తరహా సినిమాలు తీస్తూ ముందుకెళుతున్నారు. కాగా తాజాగా వర్మ, జార్జ్ రెడ్డి సినిమాలో హీరోగా నటిస్తోన్న సందీప్ మాధవ్ హీరోగా ఓ సంచలన చిత్రం చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. వర్మ తన ట్విట్టర్లో రాస్తూ, విజయవాడ రౌడీలు, రాయలసీమ ఫ్యాక్షనిస్టుల మీద సినిమాలు తీసిన నేను..హైదరాబాద్ దాదాలపై ఓ సినిమా చేస్తున్నాని తెలిపాడు. హైదరాబాద్‌లో 1980లో జరిగిన కొన్ని సంఘటన ఆధారంగా సినిమా ఉంటుందని ప్రకటించాడు. అంతేకాదు ఈ సినిమాలో నటించడానికి సందీప్ మాధవ్ సైన్ కూడా చేశాడని వర్మ పేర్కోన్నాడు.
GQ మ్యాగజైన్ కోసం దీపికా అందాల ఆరబోత..
Just signed George Reddy @SandeepMadhav_ for DADAS OF HYDERABAD ..After finishing rowdies of Vijaywada and factionists in rayalaseema, am making a film on the DADA’s of the 80’s in Hyderabad ..Story is based on a real life character my inspiration for character of SHIVA pic.twitter.com/reUkxx0No8
— Ram Gopal Varma (@RGVzoomin) November 18, 2019
దిశ హత్య కేసులో మరో కీలక ఆధారం లభ్యం.. పాతిపెట్టిన దాన్ని బయటకు తీసి...
దిశ కేసు విచారణకు 50 మంది పోలీసులు...
హైదరాబాద్‌లో దారుణం... భర్తను సజీవదహనం చేసిన భార్య...
Indian Air Force Jobs: ఎయిర్ ఫోర్స్‌లో 249 ఖాళీలు... హైదరాబాద్‌లో ట్రైనింగ్
హైదరాబాద్ మెట్రోలో పెప్పర్ స్ప్రే... మహిళలకు మాత్రమే
Gold Rate: పెరిగిన బంగారం ధర...పసిడి ప్రేమికులకు షాక్..
Loading...