మెగా ఫ్యామిలీ అంటే ఏమిటో చెప్పిన రామ్ గోపాల్ వర్మ..

Ram Gopal Varma : రామ్ గోపాల్ వర్మ ఏమి చేసినా  ఓ సంచలనమే.. వర్మ తన సినిమాలతో కన్నా... వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో ఉంటున్నాడు.

news18-telugu
Updated: October 29, 2019, 10:43 AM IST
మెగా ఫ్యామిలీ అంటే ఏమిటో చెప్పిన రామ్ గోపాల్ వర్మ..
రామ్ గోపాల్ వర్మ (Facebook)
  • Share this:
Ram Gopal Varma : రామ్ గోపాల్ వర్మ ఏమి చేసినా  ఓ సంచలనమే.. రామ్ గోపాల్ వర్మ తన సినిమాలతో కన్నా... వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో ఉంటున్నాడు. మెగా ఫ్యామిలీ అంటూ ఓ సినిమా చేస్తున్నానని పేర్కోన్న వర్మ.. అంతా తూచ్ అంటున్నాడు. అంతేకాదు మెగా ఫ్యామిలీ అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న చిరంజీవి ఫ్యామిలీ అని అందరూ అనుకుంటారు. కానీ వర్మ మాత్రం ఓ నిర్వచనం ఇచ్చారు. మెగా ఫ్యామిలీ అంటే ఓ వ్యక్తికి 39 మంది సంతానం అని.. చెబుతూ.. మెగా ఫ్యామిలీ అనే టైటిల్‌తో సినిమా తీయట్లేదని చెప్పాడు. తనకు పిల్లలంటే ఇష్టం ఉండదని అందేకే ఈ సినిమా తీయట్లేదని మరోసారి ట్విట్టర్ వేదికగా పేర్కోన్నారు. కాగా నిన్న ట్విట్టర్‌లో 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా తర్వాత తాను 'మెగా ఫ్యామిలీ' టైటిల్‌తో ఓ సినిమా తీస్తానని ప్రకటించాడు. ఇదే విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్ ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు కూడా.


అంతేకాదు 'మెగా ఫ్యామిలీ' సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఈరోజు 9.30కి వెల్లడిస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కోన్నారు. ఈ కొత్త సినిమా ప్రకటనతో.. సినీ అభిమానుల్లో ఆత్రుత, ఆసక్తి మొదలైంది. అసలు ఆ సినిమాలో ఏమి చూపించబోతున్నారు.. ఎవరీ గురించి ఆ సినిమా అంటూ ఆరాలు తీయసాగారు. కాగా అదంతా తూచ్ అంటూ అలాంటీ సినిమా ఏమి తీయట్లేదని స్పష్టం చేశాడు వర్మ.


చీరలో అందాల పరిణీతి చోప్రా... చూస్తే చూపు తిప్పుకోలేరు..
Published by: Suresh Rachamalla
First published: October 29, 2019, 10:36 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading