బాలయ్య బిహేవియర్ పై నగ్నం హీరోయిన్ కీలక వ్యాఖ్యలు..

లాక్ డౌన్ నేపథ్యంలో అందరు సినిమాలు ఎలా తీయాలో తెలియక తికమక పడుతుంటే.. రామ్ గోపాల్ వర్మ మాత్రం ఎంచక్కా రెండు సినిమాలను తీసాడు. తాజాగా ఈయన నగ్నం పేరుతో ఓ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమలో శ్రీ కథానాయికగా నటించింది. తాజాగా ఆమె నందమూరి నట సింహం బాలయ్యపై కీలక వ్యాఖ్యలు చేసింది.

news18-telugu
Updated: July 2, 2020, 3:29 PM IST
బాలయ్య బిహేవియర్ పై నగ్నం హీరోయిన్ కీలక వ్యాఖ్యలు..
బాలయ్యపై నగ్నం హీరోయిన్ కీలక వ్యాఖ్యలు (Twitter/Photo)
  • Share this:
లాక్ డౌన్ నేపథ్యంలో అందరు సినిమాలు ఎలా తీయాలో తెలియక తికమక పడుతుంటే.. రామ్ గోపాల్ వర్మ మాత్రం ఎంచక్కా రెండు సినిమాలను తీసాడు. ఆయన తీసినవి మెయిన్ స్ట్రీమ్ సినిమాలు కావు. తనకు తోచింది ఏదో తీసి పారేసాడు. తాజాగా ఈయన నగ్నం పేరుతో ఒక వివాదాస్పద సినిమాను తెరకెక్కించడం దాన్ని తనకు సంబంధించిన ఫ్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేసేయడం కూడా జరిగింది. ఈ సినిమాలో బోల్డ్‌గా నటించిన అందరి దృష్టిని ఆకర్షించింది కథానాయిక స్వీటీ. ఈ సినిమాలో బోల్డ్ సన్నివేశాల్లో ఈమె ఎలాంటి మొహమాటం లేకుండా నటించి ఔరా అనిపించింది.  ఈ సినిమాను శ్రీ కెేవలం రెండు రోజుల్లోనే పూర్తి చేయడం విశేషం.  ఆర్జీవి స్వీటీగా పరిచయం చేసిన ఈమె అసలు పేరు శ్రీ రాపాక. ఆమె తెలుగు సినీ పరిశ్రమలో కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఎంతో మంది అగ్ర హీరోలతో కలిసి పని చేసినట్టు ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో వెల్లడించింది. దాంతో పాటు ఆమె బాలయ్య బిహేవియర్ పై స్పందించింది.

బాలకృష్ణ పై నగ్నం హీరోయిన్ శ్రీ సంచలన వ్యాఖ్యలు (Twitter/Photo)


కాస్ట్యూమ్ డిజైనర్‌గా నేను చాలా మంది అగ్ర హీరోలత సినిమాలకు పనిచేసిన విషయాన్ని చెప్పుకొచ్చింది. అందులో బాలకృష్ణ, చిరంజీవి, మహేష్ బాబు, నాగార్జున వంటి చాలా మంది హీరోలు ఉన్నారని చెప్పుకొచ్చింది. అందులో ముఖ్యంగా బాలయ్య ప్రవర్తనపై ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఓసారి ఆయనతో మాట్లాడాలని బాలకృష్ణ గారి ఇంటికి వెళ్లాను. ఆయనకు ముక్కు మీద  కోపం ఉంటుందని అందరు చెబుతుంటారు. నేను కూడా భయం భయంగా ఆయన ఇంటికి వెళ్లాను. కానీ ఆయన నాతో పాటు మా టీమ్‌తో మాట్లాడిని తీరుతో ఆయనపై ఉన్న భయాలు తొలిగిపోయాయి. బాలయ్యది పూర్తిగా చిన్న పిల్లల మనస్తత్వం. మనసులో ఒకటి పెట్టుకొని బయట వేరొకటి మాట్లాడే రకం కాదనే విషయం ఆ సంఘటనతో స్పష్టమైంది. కాకపోతే.. కాస్త షార్ట్ టెంపర్. త్వరగా కోపం వచ్చేస్తుంది. ఆ తర్వాత వెంటనే కూల్ అయిపోతారు. మహిళలతో చాలా హుందాగా  మర్యాదగా ప్రవర్తిస్తారని శ్రీ తన ఇంటర్వ్యూలో బాలయ్య మనస్తత్వంపై చెప్పుకొచ్చింది.
First published: July 2, 2020, 3:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading